ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TS Politics: గాదరి కిషోర్‌పై మందుల సామేల్ విసుర్లు

ABN, Publish Date - Oct 24 , 2024 | 07:02 PM

బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్.. సీఎం రేవంత్ రెడ్డితోపాటు ఆయన కేబినెట్‌లోని మంత్రులపై ఆరోపణలు గుప్పించారు. ఈ ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు, తుంగతుర్తి ఎమ్మెల్యే మందల సామేల్ స్పందించారు. రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి కిషోర్‌కు లేదన్నారు. అయినా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు నీ వయస్సు ఎంత అని కిషోర్‌ను సూటిగా ఎమ్మెల్యే సామేల్ ప్రశ్నించారు.

హైదరాబాద్, అక్టోబర్ 24: కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌ చేసిన వ్యాఖ్యలపై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ మండిపడ్డారు. గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ మాట్లాడుతూ.. గాదరి కిషోర్ తన స్థాయిని మించి మాట్లాడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి కిషోర్‌కు లేదని తెలిపారు.

Also Read:TamilNadu: రోడ్డుపైకి భారీగా చేరిన నురగ.. ఎందుకంటే..


గాదరి కిషోర్ ఒక చిచోరగాడు అని అభివర్ణించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మరోసారి ఇలా ఇష్టానుసారంగా మాట్లాడితే నాలుక కోస్తానని ఈ సందర్భంగా గాదరి కిషోర్‌ను ఎమ్మెల్యే సామేల్ హెచ్చరించారు. అయినా గాదరి కిషోర్ బతుకెంత... స్థాయేంత..? అని ఆయన నిలదీశారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ గాదరి కిషోర్‌కి సామేల్ సూచించారు.

Also Read: Ram Mohan Naidu: ఇది చారిత్రాత్మకమైన రోజు


నల్గొండ జిల్లాకు చెందిన మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డిపై మాట్లాడే అర్హత ఈ గాదరి కిషోర్‌కు ఉందా? అని పేర్కొన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు నీ వయస్సు ఎంత అని కిషోర్‌ని ఈ సందర్భంగా ప్రశ్నించారు. కోమటిరెడ్డి తలుచుకుంటే గాదరి కిషోర్ నల్గొండలో అడుగుపెట్టగలడా..? అని నిలదీశారు. గాదరి కిషోర్ కథలన్నీ బయటకు తీస్తే జైలుకు పోవడం ఖాయమని పేర్కొన్నారు.

Also Read: Viral Video: నడిరోడ్లపై సొంత కార్లు వదిలి నడుచుకుంటూ వెళ్లిపోతున్నారు.. ఎక్కడంటే.. ?


గాదరి కిషోర్‌కు ఇచ్చిన డాక్టరేట్‌పైన సందేహాలు ఉన్నాయన్నారు. దీనిపై విచారణ జరపాలని ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఎమ్మెల్యే సామేల్ సూచించారు. అక్రమ ఇసుక దందాలో గాదరి కిషోర్‌కు డాక్టరేట్ ఇవ్వవచ్చునన్నారు. మాజీ నక్సలైట్ నయూంతో కలిసి కిషోర్ చేసిన భూ దందాలపైన విచారణ జరగాలని డిమాండ్ చేశారు.

Also Read: తలతిరుగుడు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటించండి..


ఎవరు అడ్డుపడినా మూసీ ప్రక్షాళన మాత్రం ఆగదని ఆయన బల్లగుద్ది చెప్పారు. మూసిపై మాట్లాడే నైతిక హక్కు మాజీ మంత్రులు కేటీఆర్, హారీశ్ రావులకు లేదని స్పష్టం చేశారు. ధర్నా చౌక్‌లు ఎత్తివేసిన వారు ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారని.. ఇది విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే సామేల్ పేర్కొన్నారు.

 For Telangana News And Telugu News

Updated Date - Oct 24 , 2024 | 08:19 PM