ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Controversy: అసత్యాలకు కేరాఫ్‌ ‘సాక్షి’

ABN, Publish Date - Oct 09 , 2024 | 03:33 AM

వాస్తవాలతో సంబంధం లేకుండా అసత్యాలు వ్యాప్తి చేయడానికే ‘సాక్షి’ మీడియా సంస్థ ఉన్నట్టు మరోసారి స్పష్టమైంది. ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ ట్యాగ్‌లైన్‌ అంశంలో ఆ సంస్థ వ్యవహరిస్తోన్న తీరు ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.

  • ట్యాగ్‌లైన్‌ అంశంలో వితండవాదం

  • తప్పు ఒప్పుకుంటూనే ‘ఆంధ్రజ్యోతి’పై బురద జల్లే యత్నం

హైదరాబాద్‌, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): వాస్తవాలతో సంబంధం లేకుండా అసత్యాలు వ్యాప్తి చేయడానికే ‘సాక్షి’ మీడియా సంస్థ ఉన్నట్టు మరోసారి స్పష్టమైంది. ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ ట్యాగ్‌లైన్‌ అంశంలో ఆ సంస్థ వ్యవహరిస్తోన్న తీరు ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. పాత్రికేయ విలువలకు తిలోదకాలిచ్చిన సాక్షి.. ‘ఆంధ్రజ్యోతి’ ట్యాగ్‌ను వాడి, తన వెబ్‌సైట్లో తమ సొంత వార్తలను ప్రచారం చేసుకున్న సంగతి తెలిసిందే. ట్యాగ్‌లైన్‌ విషయంలో తన అభ్యంతరాలు, అందుకు కారణాలను ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ స్పష్టంగా పేర్కొంది. పాత్రికేయ విలువలను పక్కనబెట్టి అనైతిక పద్ధతుల్లో విశేష జనాదరణ కలిగిన ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ పేరును వినియోగించడం సరికాదని ‘సాక్షి’ని కోరింది.


చేసిన పనికి క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో న్యాయపరంగా ముందుకెళ్తామని స్పష్టం చేసింది. అయితే, ఈ అంశంలో సాక్షి సంస్థ తన తప్పును అంగీకరిస్తూనే వితండవాదానికి దిగింది. ఒక వార్తా సంస్థకు సంబంధించిన ట్యాగ్‌లైన్‌ను మరో వార్తా సంస్థ ఉపయోగించకూడదనే విషయాన్ని ఆ పత్రిక ఎడిటర్‌ మంగళవారం తన ఎడిటోరియల్‌లో ప్రస్తావించారు. దీని ప్రకారం తాము చేసింది తప్పని ఆయన చెప్పకనే చెప్పారు. కానీ, ‘ఆంధ్రజ్యోతి’కి సంబంధించిన కథనాలు రాసినప్పుడు అనుబంధ ట్యాగ్‌లైన్‌ను వాడాల్సి వస్తుందంటూ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు.


తద్వారా ఏదైనా ఒక వార్తను రాస్తే దానికి సంబంధించిన కీ వర్డ్స్‌ను ఉపయోగిస్తారు కానీ ప్రతీ వార్తకు ట్యాగ్‌లను ఉపయోగించరనే కనీస అవగాహన సాక్షికి లేదని అర్థమైంది. అంతేకాక, కీ వర్డ్స్‌, ట్యాగ్‌ను ఎందుకు ఉపయోగిస్తారనే విషయంపై అసత్యాల సాక్షి మీడియా సంస్థకు కనీస అవగాహన లేదన్న విషయం తేలిపోయుంది. తాము చేసిన తప్పును ఒప్పుకుంటూనే దమ్మున్న పత్రిక ‘ఆంధ్రజ్యోతి’పై అసత్యాల ‘సాక్షి’ బురదజల్లేందుకు విఫలయత్నం చేసింది. నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ నిజాలను నిర్భయంగా చెప్పే మీడియా సంస్థ ఎవరిదో ప్రజలకు తెలియంది కాదు. ఇకనైనా అసత్యాలు ఆపి తప్పును ఒప్పుకుంటే అసత్యాల ‘సాక్షి’కి కాస్త గౌరవమైనా దక్కుతుంది.

Updated Date - Oct 09 , 2024 | 03:33 AM