ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nelakondapalli : కిరాయికి దిగి కిరాతకానికి ఒడిగట్టారు

ABN, Publish Date - Dec 14 , 2024 | 05:41 AM

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన దంపతులను వారింట్లో కిరాయికి ఉంటున్న వ్యక్తులే చంపేశారు. దంపతులు డబ్బున్నవారని తెలిసి..

  • నేలకొండపల్లి దంపతుల హత్య కేసులో వీడిన మిస్టరీ

ఖమ్మం, డిసెంబరు13(ఆంధ్రజ్యోతి): ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన దంపతులను వారింట్లో కిరాయికి ఉంటున్న వ్యక్తులే చంపేశారు. దంపతులు డబ్బున్నవారని తెలిసి.. పథకం ప్రకారం అద్దెకు దిగి.. ఇంట్లోకి చొరబడి ప్రాణాలు తీసి, దొరికినంత దోచుకొని ఉడాయించారు! ఈ మేరకు నేలకొండపల్లిలో 17 రోజుల క్రితం జరిగిన దంపతులు యర్రా వెంకటరమణ (62), కృష్ణకుమారి (60) దంపతుల హత్య వెనుక మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఆ వివరాలు.. ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్ల మండలం మోగుళూరుకు చెందిన షేక్‌ అబిద్‌ అలియాస్‌ అబిద్‌ అలీ, సోహైల్‌, ఆరిఫ్‌ అనే వ్యక్తి బై సెక్సువల్‌! 2011లో కంచికచర్లలో జరిగిన ఓ హత్య కేసులో 2014లో జీవితఖైదు శిక్ష పడింది. అప్పటి నుంచి రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో శిక్ష అనుభవిస్తున్న అతడు ఈ ఏడాది పెరోల్‌ మీద బయటకొచ్చాడు. గడువు ముగిసినా జైలుకు వెళ్లకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ క్రమంలో కోదాడకు వెళ్లి పేరు మార్చుకున్నాడు. జల్సాలకు అలవాటుపడ్డ అబిద్‌.. నేలకొండపల్లిలోని బియ్యం వ్యాపారం చేసే యర్రా వెంకటరమణ గురించి తెలుసుకున్నాడు. ఆయన డబ్బులు బాగా సంపాదించాడని, ఇంట్లో ఆయన, భార్య కృష్ణకుమారి మాత్రమే ఉంటారని తెలుసుకున్నాడు. ఆ ఇంట్లో పలు పోర్షన్లు కిరాయికిస్తారని తెలుసుకున్న అబిద్‌... నవంబరు రెండో వారంలో ఆ ఇంట్లో అద్దెకు దిగాడు. అదును చూసి.. తన స్నేహితులతో కలిసి ఓనర్‌ఇంట్లోకి చొరబడ్డాడు. కృష్ణకుమారి, వెంకటరమణలను హత్యచేసి..వారి శరీరంపైఉన్న, ఇంట్లోని బంగారం,డబ్బుతో పారిపోయాడని పోలీసులు తెలిపారు.

Updated Date - Dec 14 , 2024 | 05:41 AM