ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Financial Struggles: ఆర్థిక ఇబ్బందులతో దంపతుల ఆత్మహత్య..

ABN, Publish Date - Oct 21 , 2024 | 04:56 AM

వ్యాపారంలో నష్టం, కుటుంబకలహాలతో దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సంగారెడ్డి జిల్లా ఝరాసంగంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది.

  • సిరిసిల్లలో నేతకార్మికుడి బలవన్మరణం

ఝరాసంగం, సిరిసిల్ల క్రైం, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): వ్యాపారంలో నష్టం, కుటుంబకలహాలతో దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సంగారెడ్డి జిల్లా ఝరాసంగంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. భార్యాభర్తలైన బొందిలి ప్రతా్‌పసింగ్‌(60) కళావతి(50)... కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయం ముందు హోటల్‌ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కొంతకాలంగా వ్యాపారం సరిగా నడవకపోవడంతో ఇద్దరికి తరుచు గొడవలు జరుగుతుండేవి. కుటుంబసభ్యులు, బంధువులు వారికి సర్దిచెప్తుండేవారు.


ఆదివారం మరోసారి గొడవ జరగడం...మరోవైపు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో కుటుంబపోషణ భారంగా మారడంతో మనస్థాపానికి గురై గ్రామంలోని తమ పొలం వద్ద పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. మరో ఘటనలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీవైనగర్‌కు చెందిన ఆడెపు సంపత్‌ (60) అనే చేనేత కార్మికుడు ఉపాధి లేక ఆదివారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సిరిసిల్ల వస్త్రపరిశ్రమలో సంక్షోభం కారణంగా నాలుగు నెలలుగా పని లేకుండా పోవడంతో చేతిలో చిల్లిగవ్వ లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. రోజురోజుకు కుటుంబం గడవడం కష్టమవుతోందని మనస్తాపం చెంది ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకున్నాడు.

Updated Date - Oct 21 , 2024 | 04:56 AM