CP CV Anand: ఎమ్మెల్యే అనుచరులకు సీపీ వార్నింగ్.. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే..
ABN, Publish Date - Oct 25 , 2024 | 08:17 AM
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా సహించేది లేదని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్(Hyderabad CP CV Anand) హెచ్చరించారు. అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ హోదాలో ఆయన గురువారం కార్యనిర్వాహక న్యాయస్థానాన్ని నిర్వహించి పలు కేసులను విచారించారు.
- ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్, ఫిరోజ్‌ఖాన్ అనుచరులను అడిషనల్ మేజిస్ట్రేట్ హోదాలో విచారించిన సీపీ సీవీ ఆనంద్
హైదరాబాద్ సిటీ: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా సహించేది లేదని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్(Hyderabad CP CV Anand) హెచ్చరించారు. అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ హోదాలో ఆయన గురువారం కార్యనిర్వాహక న్యాయస్థానాన్ని నిర్వహించి పలు కేసులను విచారించారు. ఈ సందర్భంగా ఇటీవల హుమాయూన్‌నగర్ పోలీస్‌స్టేషన్(Humayunnagar Police Station) పరిధిలో కాంగ్రెస్, ఎంఐఎం పార్టీ వర్గీయుల మధ్య జరిగిన ఆధిపత్య పోరులో ఇరువర్గాలపై నమోదైన కేసును సీపీ విచారించారు.
ఈ వార్తను కూడా చదవండి: MP Eatala: సచివాలయాన్ని బఫర్ జోన్‌లో కట్టలేదా..
అక్టోబరు-7న హుమాయున్‌నగర్‌లోని ఫిరోజ్‌గాంధీనగర్‌లో జరుగుతున్న సీసీ రోడ్డు పనులను ఎంఐఎం ఎమ్మెల్యే మహ్మద్ మాజిద్ హుస్సేన్(MIM MLA Mohammad Majid Hussain) తన అనుచరులతో కలిసి పరిశీలిస్తున్నారు. అదే సమయానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫిరోజ్‌ఖాన్ సీసీ రోడ్డు పనులను తనిఖీ చేయడానికి తన అనుచరులతో వచ్చారు. దీనికి ఎమ్మెల్యే అనుచరులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదం జరిగింది. గొడవ ముదిరి కొట్లాటకు దారితీసింది. తోపులాటలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.
ఈ నేపథ్యంలో స్థానికంగా శాంతి భద్రతలకు విఘాతం కలగడంతో పాటు, ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి బీఎన్‌ఎస్ సెక్షన్ 194 కింద కేసులు నమోదు చేశారు. 107 సీఆర్‌పీసీ సెక్షన్ ప్రకారం.. శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన వ్యక్తులను అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ హోదాలో సీపీ ఇరువర్గాలను విచారించారు. ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ గ్రూపులో 10 మంది, ఫిరోజ్‌ఖాన్ గ్రూపులో 9 మందిని సీపీ విచారించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: ఉద్యోగులకు రెండు డీఏలు!
ఈవార్తను కూడా చదవండి: KTR: ఒకటి, రెండేళ్లు జైలుకు వెళ్లడానికైనా సిద్ధమే
ఈవార్తను కూడా చదవండి: రాష్ట్రంలోనే సొంతంగా సీడ్ గార్డెన్: తుమ్మల
ఈవార్తను కూడా చదవండి: నేడు సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్
Read Latest Telangana News and National News
Updated Date - Oct 25 , 2024 | 08:22 AM