CP CV Anand: ఆ కార్యక్రమాల నిర్వహణకు 15 రోజుల ముందే అనుమతులు తీసుకోవాలి
ABN, Publish Date - Dec 13 , 2024 | 07:21 AM
కొత్త ఏడాది వేడుకల సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించే త్రీస్టార్, ఫైవ్‌స్టార్ హోటళ్ల నిర్వాహకులు ఎంట్రీ, ఎగ్జిట్ గేట్ల వద్ద విధిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నగర సీపీ సీవీ ఆనంద్(CP CV Anand) తెలిపారు.
- ఎంట్రీ, ఎగ్జిట్‌ల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరి
- న్యూ ఇయర్ ఈవెంట్ నిర్వాహకులకు సీపీ సీవీ ఆనంద్ సూచనలు
హైదరాబాద్ సిటీ: కొత్త ఏడాది వేడుకల సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించే త్రీస్టార్, ఫైవ్‌స్టార్ హోటళ్ల నిర్వాహకులు ఎంట్రీ, ఎగ్జిట్ గేట్ల వద్ద విధిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నగర సీపీ సీవీ ఆనంద్(CP CV Anand) తెలిపారు. అలాగే ఈవెంట్లకు సంబంధించి 15 రోజుల ముందే అనుమతులు తీసుకోవాలని సూచించారు. ఈవెంట్లు నిర్వహించే సమయంలో నిబంధనలు పాటించాలని, సీసీ కెమెరా(CC camera)ల రికార్డింగ్‌ను భద్రపరచాలని సూచించారు.
ఈ వార్తను కూడా చదవండి: AV Ranganath: రంగనాథ్ హెచ్చరిక.. హైడ్రాపై తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు
ఈవెంట్ల వద్ద ట్రాఫిక్‌జాం కాకుండా ఉండేందుకు ప్రైవేటు సెక్యూరిటీని నియమించుకోవాలన్నారు. ఇతరులకు ఇబ్బంది కలగకుండా డీజే సౌండ్(DJ Sound) ఉండాలన్నారు. రాత్రి 10 గంటలకు పెద్ద శబ్దం వచ్చే యాంప్లిఫయర్లు ఆపేయాలన్నారు. మద్యం సరఫరా చేసే ఈవెంట్లలో మైనర్లకు ప్రవేశం లేకుండా చూడాలన్నారు.
పార్టీలో డ్రగ్స్ వినియోగించకుండా చూసే బాధ్యత నిర్వాహకులదేనన్నారు. ఈవెంట్లలో మహిళల భద్రతకు షీటీమ్స్ అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా ప్రత్యేక డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈవెంట్ల నిర్వాహకులు మద్యం సేవించిన వారికి సహకరించేందుకు డ్రైవర్లను, క్యాబ్‌లను బుక్ చేయాలని సూచించారు.
ఈవార్తను కూడా చదవండి: Seethakka: చర్యలు తీసుకున్నా మీరు మారరా ?
ఈవార్తను కూడా చదవండి: సీఎం సారూ.. రుణమాఫీ చేసి ఆదుకోండి!
ఈవార్తను కూడా చదవండి: తెలంగాణ సంస్కృతిపై దాడి : బండి సంజయ్
ఈవార్తను కూడా చదవండి: అక్కా.. నేను చనిపోతున్నా
Read Latest Telangana News and National News
Updated Date - Dec 13 , 2024 | 07:21 AM