Manoj Controversy: మంచు ఫ్యామిలీ వివాదం.. సీపీ సీరియస్ వార్నింగ్..!
ABN, Publish Date - Dec 11 , 2024 | 01:19 PM
Manchu Manoj vs Mohanbabu Controversy: మంచు ఫ్యామిలీ వివాదం పోలీస్ స్టేషన్‌కు చేరింది. ఈ వ్యవహారంలో మంచు మనోజ్ బుధవారం నాడు నేరేడ్‌మెట్‌లోని రాచకొండ సీపీ కార్యాలయానికి వచ్చారు.
Manchu Manoj vs Mohanbabu Controversy: మంచు ఫ్యామిలీ వివాదం పోలీస్ స్టేషన్‌కు చేరింది. ఈ వ్యవహారంలో మంచు మనోజ్ బుధవారం నాడు నేరేడ్‌మెట్‌లోని రాచకొండ సీపీ కార్యాలయానికి వచ్చారు. సీపీ ముందు విచారణకు హాజరయ్యారు. సీపీ సుధీర్ బాబు ముందు వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యారు మంచు మనోజ్. ఈ సందర్భంగా సీపీ కీలక కామెంట్స్ చేశారు. మంచు మనోజ్, మోహన్ బాబు, విష్ణు వల్ల శాంతి భద్రతల విఘాతం కలిగాయని నోటీసులు ఇచ్చారు సీపీ. మరోసారి శాంతి భద్రతలకు విగాథం కలిగేలా వ్యవహరించొద్దని సీపీ వార్నింగ్ ఇచ్చారు. ఏడాది వరకు ఎలాంటి గొడవలు గానీ.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం గానీ చేయొద్దని స్పష్టం చేశారు. అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ హోదాలో సీపీ ఈ దేశాలిచ్చారు. ఒకవేళ ఎలాంటి ఘర్షణ వాతావరణం క్రియేట్ చేసినా.. లక్ష రూపాయల జరిమానా ఉంటుందని సీపీ హెచ్చరించారు.
Updated Date - Dec 11 , 2024 | 01:19 PM