ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CPI Narayana: సాయుధ పోరాట వీరులకు రెడ్‌ సెల్యూట్‌

ABN, Publish Date - Sep 12 , 2024 | 04:31 AM

తెలంగాణ విలీన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.

  • వీరులను స్మరించుకుంటూ నగరంలో సీపీఐ ర్యాలీ :నారాయణ

హైదరాబాద్‌, సెప్టెంబరు 11: తెలంగాణ విలీన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. సాయుధ పోరాట యోధులను స్మరించుకుంటూ సీపీఐ పార్టీ హైదరాబాద్‌లో రెడ్‌ సెల్యూట్‌ ర్యాలీని నిర్వహించింది. ట్యాంక్‌బండ్‌ నుంచి లిబర్టీ వరకు ఈ ర్యాలీ సాగింది. పార్టీ శ్రేణులు ఎర్ర చొక్కాలు ధరించి ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట ఫలితమే భారతదేశంలో హైదరాబాద్‌ సంస్థాన విలీనమని గుర్తుచేశారు.


అంతటి మహత్తర పోరాటం జరిగినా నేటికీ పాలకులు అధికారికంగా విలీన దినోత్సవాన్ని నిర్వహించకపోవడం దారుణమన్నారు. రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ సాయుధ పోరాటంలో 4వేల మంది కమ్యూనిస్టులు వీర మరణం పొందారన్నారు. అది హిందూ, ముస్లింల పోరాటం కాదని, 90 శాతం మంది మట్టి మనుషులు బందూకులుపట్టి నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడిన మహోన్నత ఉద్యమమని పేర్కొన్నారు. పోరాట చరిత్రను వక్రీకరించడం దుర్మార్గమని చాడ వెంకటరెడ్డి తెలిపారు.


  • మంత్రి కోమటిరెడ్డికి భౌమాకోస్‌ ఎక్స్‌పో ఇండియా ఆహ్వానం

అమెరికన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఎక్వి్‌పమెంట్‌ మ్యాన్‌ఫ్యాక్చరర్స్‌తో కలిసి మెస్సే ముంచెన్‌ ఇండియా సంస్థ డిసెంబరు 11 నుంచి 14 వరకు గ్రేటర్‌ నోయిడాలో నిర్వహిస్తున్న ప్రతిష్ఠాత్మక భౌమాకోన్‌ ఎక్స్‌పో ఇండియాకు హాజరు కావాలని కోరుతూ నిర్వాహకులు బుధవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.

Updated Date - Sep 12 , 2024 | 04:31 AM

Advertising
Advertising