ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

D. Raja: కార్పొరేట్‌ శక్తులకు కేంద్రం ఊడిగం

ABN, Publish Date - Aug 23 , 2024 | 03:06 AM

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలను అవలంభిస్తోందని, రాజ్యాంగ విలువలపై దాడి చేస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపీ డి.రాజా విమర్శించారు.

  • మోదీ అప్రజాస్వామిక విధానాలపై పోరాడదాం: డి.రాజా

హనుమకొండ, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలను అవలంభిస్తోందని, రాజ్యాంగ విలువలపై దాడి చేస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపీ డి.రాజా విమర్శించారు. మోదీ ప్రభుత్వ అప్రజాస్వామిక, రాజ్యాంగ వ్యతిరేక, మతతత్వ విధానాలను అడ్డుకునేందుకు ప్రజాస్వామికవాదులు, ప్రజలు ఒక్కటి కావాలని రాజా పిలుపునిచ్చారు. గురువారం హనుమకొండలో సీపీఐ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్‌ నిర్మాణ సమావేశాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.


మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు రాజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బ్యూరోక్రసీలోకి ఆర్‌ఎ్‌సఎస్‌ శక్తులను జొప్పించే ప్రయత్నం మోదీ చేస్తున్నారని, ఇదే జరిగితే భవిష్యత్తులో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్పొరేట్‌ శక్తులకు ఊడిగం చేస్తోందని, ఆదానీ, అంబానీలకు దేశ సంపదను దోచిపెడుతోందని విమర్శించారు. హిండెన్‌బర్గ్‌ సంస్థ చేసిన ఆరోపణలపై విచారణకు జాయింట్‌ పార్లమెంట్‌ కమిటీ (జేపీసీ) వేయాలని రాజా డిమాండ్‌ చేశారు

Updated Date - Aug 23 , 2024 | 03:06 AM

Advertising
Advertising
<