ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

CS Shanti Kumari: తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేవు

ABN, Publish Date - Mar 19 , 2024 | 10:10 PM

రాష్ట్రంలోని రిజర్వాయర్లలో సరిపడా నీరు ఉన్నందున ప్రస్తుత వేసవికాలంలో తాగునీటి అవసరాలకు ఏవిధమైన ఇబ్బందులు లేవని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి (CS Shanti Kumari) స్పష్టం చేశారు. తాగునీటి సరఫరా పరిస్థితులపై సంబంధిత శాఖల అధికారులతో నేడు(మంగళవారం) సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.

హైదరాబాద్: రాష్ట్రంలోని రిజర్వాయర్లలో సరిపడా నీరు ఉన్నందున ప్రస్తుత వేసవికాలంలో తాగునీటి అవసరాలకు ఏవిధమైన ఇబ్బందులు లేవని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి (CS Shanti Kumari) స్పష్టం చేశారు. తాగునీటి సరఫరా పరిస్థితులపై సంబంధిత శాఖల అధికారులతో నేడు(మంగళవారం) సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. యుద్ధప్రాతిపదికన మరమ్మత్తులు చేపట్టి తాగునీటి సరఫరాను నిర్విరామంగా కొనసాగించాలని సీఎస్ ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్‌లోనూ సరిపడా నీటిని అందిస్తున్నామని, ఎవరైనా అదనపు వాటర్ ట్యాంకులు కోరితే వాటిని కూడా అందిస్తున్నామని తెలిపారు.

మంచినీటి సరఫరా విషయంలో ఏవిధమైన ఆందోళనలు అవసరం లేదని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లలో నీటి లభ్యత ఉందన్నారు. వేసవి కాలంలో తాగునీటి సరఫరాకు తీసుకున్న చర్యలపై సంబంధిత శాఖల కార్యదర్శులకు పలు సూచనలు చేశారు. పదోతరగతి పరీక్షల నిర్వహణను పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు సీఎస్ శాంతి కుమారి తెలిపారు. ఈ సమావేశానికి మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, పంచాయతీ రాజ్ కమిషనర్ అనితా రామచంద్రన్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, మున్సిపల్ శాఖ డైరెక్టర్ దివ్య, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి తదితర అధికారులు హాజరయ్యారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 19 , 2024 | 10:10 PM

Advertising
Advertising