Congress: సీడబ్ల్యూసీ కీలక భేటీ.. తెలంగాణ ఎంపీ స్థానాలపై చర్చ
ABN, Publish Date - Mar 19 , 2024 | 06:07 PM
ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో కాంగ్రెస్ (Congress) సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మంగళవారం నాడు సమావేశం అయింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్, తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర సభ్యులు హాజరయ్యారు.
ఢిల్లీ: ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో కాంగ్రెస్ (Congress) సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మంగళవారం నాడు సమావేశం అయింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్, తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర సభ్యులు హాజరయ్యారు. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో కర్ణాటక, తెలంగాణ , గుజరాత్, మధ్యప్రదేశ్, చండీఘడ్, సిక్కిం , వెస్ట్ బెంగాల్, అండమాన్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల లోక్ సభ అభ్యర్థులపై కసరత్తు చేస్తున్నారు. తెలంగాణ నుంచి టీపీసీసీ ప్రెసిడెంట్, సీఎం రేవంత్ రెడ్డి , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు.
ఇప్పటి వరకు రెండు జాబితాల్లో 82 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. తెలంగాణలో 17 లోక్ సభ స్థానాల్లో 4 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. 13 పార్లమెంట్ స్థానాలపై నేడు(మంగళవారం) సమావేశంలో చర్చించనున్నారు. సీఈసీ సమావేశంలో తెలంగాణలో దాదాపు 7 నుంచి 9 ఎంపీ స్థానాలపై ఏకాభిప్రాయం వచ్చే అవకాశం ఉంది. రేపు(బుధవారం) కానీ ఎల్లుండి(గురువారం) అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Mar 19 , 2024 | 06:49 PM