ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Cyber Crime: అసలు దొంగలు దొరకరు.. కొసరు దొంగలతో కేసులు క్లోజ్‌

ABN, Publish Date - Sep 12 , 2024 | 03:49 AM

దేశ రాజధాని ఢిల్లీలో కాల్‌ సెంటర్‌.. హరియాణాలో తీసుకున్న సిమ్‌కార్డులు.. ముంబైలోనో, లఖ్‌నవూలోనో బ్యాంకు ఖాతాలు..

  • పోలీసులకు సవాల్‌గా మారిన సైబర్‌ నేరాలు

  • కేసుల ఛేదనకు 4-5 రాష్ట్రాలు తిరగాల్సిన స్థితి

  • నెలల తరబడి వెతికినా ఫలితాలు లభించక.. తలలు పట్టుకుంటున్నసైబర్‌ క్రైమ్‌ బృందాలు!

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): దేశ రాజధాని ఢిల్లీలో కాల్‌ సెంటర్‌.. హరియాణాలో తీసుకున్న సిమ్‌కార్డులు.. ముంబైలోనో, లఖ్‌నవూలోనో బ్యాంకు ఖాతాలు.. హైదరాబాద్‌లో బురిడీలు.. కాజేసిన సొమ్ము గుజరాత్‌లో ఉపసంహరణ.. ..ఇదీ సైబర్‌ కేటుగాళ్ల దోపిడీ తీరు! పోలీసులకు దొరక్కుండా ఉండటానికి, దర్యాప్తు క్రమంలో పోలీసులకు చుక్కలు చూపించడానికి సైబర్‌ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తున్నారు. దాంతో ఒక్కో కేసునూ చేదించడానికి సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ బృందాలు సుమారు 4, 5 రాష్ట్రాల్లోని పలు నగరాలు తిరిగి విచారణ చేయాల్సి వస్తోంది. ఇంతా కష్టపడి పడినా.. అసలు దొంగలు దొరకరు.. కేవలం కొసరు దొంగలనే అరెస్టు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.


ఉదాహరణకు.. ఇటీవల హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి సైబర్‌ నేరగాళ్ల మాయలో పడ్డాడు. ‘‘మీ బ్యాంకు ఖాతా కేవైసీ అప్‌డేట్‌ చేయకుంటే బ్లాక్‌ అవుతుంది’’ అంటూ నేరగాళ్లు ఆయన వాట్సాప్‌ నంబర్‌కు ఒక ఆ లింక్‌ను పంపారు. దాన్ని క్లిక్‌ చేసిన బాధితుడు అందులో వివరాలు అప్‌లోడ్‌ చేశాడు. అంతే.. వెంటనే ఆయన ఖా తాలో ఉన్న సుమారు రూ. 10 లక్షల సొమ్మును సైబర్‌ నేరగాళ్లు తమ ఖాతాల్లోకి వేసేసుకున్నారు. బాధితుడు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు పిర్యాదు చేశాడు. పోలీసులు సాంకేతిక ఆధారాలను సేకరించగా.. బాధితుని ఖాతాలోని డబ్బు కొల్లగొట్టిన క్రిమినల్స్‌ ఆ డబ్బును అరగంట వ్యవధిలోనే నాలుగైదు రాష్ట్రాల్లో వివిధ నగరాల్లోని బ్యాంకు ఖాతాలకు మళ్లించి.. గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, గుర్గావ్‌ తదితర ప్రాంతాల నుంచి విత్‌డ్రా చేసినట్లు గుర్తించారు. అంటే.. ఇప్పుడా కేసు దర్యాప్తు చేయాలంటే ఆయా రాష్ట్రాల్లోని నగరాలన్నింటికీ వెళ్లాల్సిందే!


  • దుబాయ్‌ నుంచి దందా..

స్టాక్‌ మార్కెట్లో, ఆన్‌లైన్‌ గేమింగ్‌లో పెట్టుబడులు పెడితే.. 30ు లాభాలు వస్తాయని నమ్మించి నగర యువతిని బురిడీ కొట్టించిన సైబర్‌ కేటుగాళ్లు.. ఇటీవల 3.16 కోట్లు కొల్లగొట్టారు. ఈ కేసులో ఇటీవలే మహారాష్ట్రకు చెందిన సైబర్‌ ముఠాను సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తులో భాగంగా.. దేశంలోని అన్ని నగరాలు తిరిగి టెక్నికల్‌ ఎవిడెన్స్‌ సేకరించి వారిని పట్టుకోవడానికి మన పోలీసులకు సుమారు 3 నెలలు పట్టింది. తీరా పట్టుకున్నాక.. ప్రధాన నిందితులు దుబాయ్‌, హాంకాంగ్‌లో ఉండి ఇక్కడ ఈ దందా నడిపిస్తున్నట్టు దర్యాప్తులో తేలింది. ఇలా కొల్లగొట్టిన డబ్బును వారు హవాలా మార్గంలో చెప్పిన చోటుకు చేర్చడానికి ప్రత్యేక ముఠాను కూడా ఏర్పాటు చేసుకున్నారని తెలిసింది. దుబాయ్‌లో ఉంటున్న ప్రధాన నిందితులు ఇప్పటికీ పోలీసులకు చిక్కలేదు.


  • అద్దెకు బ్యాంకు ఖాతాలు

ఇటీవల ఒక కేసు దర్యాప్తులో భాగంగా.. ముంబైకి చెందిన మహ్మద్‌ షోయబ్‌ బబ్లూఖాన్‌ అనే నేరగాణ్ని పోలీసులు పట్టుకున్నారు. అతడి వద్ద 37 చెక్‌బుక్‌లు, 38 డెబిట్‌ కార్డులు, 11 పాస్‌బుక్‌లు, నకిలీ కంపెనీల రబ్బరు స్టాంపులు, 12 సిమ్‌కార్డులు, ఒక ల్యాప్‌టాప్‌ స్వాధీనం చేసుకున్నారు. అతణ్ని విచారించగా.. తన పేరిట, తనకు తెలిసిన వారిపేరిట, కంపెనీల పేరిట నకిలీ పత్రాలు సృష్టించి, బ్యాంకుల్లోనికిందిస్థాయి సిబ్బందిని మ్యానేజ్‌ చేసి బ్యాంకు ఖాతాలు సృష్టించి, వాటిని సైబర్‌ నేరగాళ్లకు అద్దెకు ఇస్తున్నట్లు తెలిపాడు. ఒక్కో ఖాతాకూ నెలకు రూ.లక్ష అద్దె తీసుకుంటున్న కేటుగాడు.. ఆ ఖాతాకు సంబంఽధించిన ఏటీఎం కార్దు, పాస్‌బుక్‌ అన్నింటినీ సైబర్‌ నేరగాళ్లకు ఇచ్చేవాడు.


ఇలాంటి అద్దె ఖాతాలు వినియోగించడం వల్ల అసలైన సైబర్‌ నేరగాళ్లు పోలీసులకు చిక్కకుండా ఉంటున్నారు. కొన్ని సందర్భాల్లో.. చదువుకోని అమాయకులను మాయ చేసి వారి పేరిట ఖాతాలు తెరుస్తున్నారు. సాంకేతిక సాక్ష్యాల ఆధారంగా పోలీసులు వారి వద్దకు వెళ్లినా.. నిరక్షరాస్యులు కాబట్టి వారికి ఆ ఖాతా గురించి గానీ, దాని ద్వారా జరిగే ఆర్థిక లావాదేవీల గురించి గానీ తెలియదు. ఒక కేసు దర్యాప్తు పూర్తిచేసేలోపే.. పెద్దసంఖ్యలో కొత్త కేసులు నమోదవుతుండడంతో ఏం చేయాలో తోచక పోలీసులు తలపట్టుకుంటున్నారు. ఏటా వేల కేసులు నమోదవుతుంటే.. పదుల సంఖ్యలో కూడా కేసులు ఛేదించలేకపోతున్నారు.

Updated Date - Sep 12 , 2024 | 03:49 AM

Advertising
Advertising