Cyber Fraud: ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరిట రూ.5.4 కోట్ల మోసం
ABN, Publish Date - Aug 18 , 2024 | 03:51 AM
ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయని నమ్మించిన సైబర్ నేరగాళ్లు ఏకంగా రూ.5.4 కోట్లు కొట్టేశారు. హైదరాబాద్ చిక్కడపల్లిలో నివసించే వ్యక్తి ట్రేడింగ్ నిర్వహిస్తుంటాడు.
బాధితుడి ఫిర్యాదుతో ఇద్దరిని అరెస్టు చేసిన సీఎ్‌సబీ
హైదరాబాద్, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయని నమ్మించిన సైబర్ నేరగాళ్లు ఏకంగా రూ.5.4 కోట్లు కొట్టేశారు. హైదరాబాద్ చిక్కడపల్లిలో నివసించే వ్యక్తి ట్రేడింగ్ నిర్వహిస్తుంటాడు. అయితే జూన్ 8న తన వాట్సా్‌పకు వచ్చి న ఆన్‌లైన్ పెట్టుబడుల లింక్ ఓపెన్ చేసి గ్రూపులో చేరాడు. ‘బీ6/స్టాక్ విజనరీస్’ పేరుతో ఉన్న గ్రూప్‌లో లైదియ శర్మ అనే మహిళ గోల్డ్‌మెన్ స్కీం గురించి అతడికి వివరించింది. పెట్టుబడులు పెట్టి లాభాలు ఆర్జించాలంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. పాన్‌కార్డు, ఆధార్ కార్డుతోపాటు ఇతర వివరాలతో ఆమె చెప్పిన వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి ట్రేడింగ్ మొదలుపెట్టాడు.
జూలై 10న మొదటగా రూ.30 వేలు పెట్టుబడి పెట్టగా మంచి లాభాలు వచ్చాయి. అయితే కేరళలో తాను నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థకు రూ. 8.5 కోట్లు అప్పు ఉందని అతడు చెప్పడంతో.. లైదియా ట్రేడింగ్‌తో మంచి లాభాలు వస్తాయని, అప్పు సులువుగా తీర్చవచ్చని నమ్మించింది. దీంతో అతడు నెల రోజుల్లో పలు దఫాలుగా రూ. 5.4 కోట్లు పెట్టుబడిగా పెట్టాడు.
వెబ్‌సైట్‌లో బాధితుడికి రూ.15.58 కోట్లు లాభం వచ్చినట్లు చూపిస్తున్నా.. విత్‌డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా ఫలితం లేకుండా పోయింది. దీంతో వారిని సంప్రదించగా.. విత్‌డ్రా చేసుకోవాలంటే మరికొంత చెల్లించాలని డిమాండ్ చేశారు. మోసపోయానని గుర్తించిన అతడు.. సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఏపీలోని విజయవాడలో రాంపల్లి కొండల్ రావు, అతని సోదరుడు చంద్రశేఖర్ ఆజాద్‌ను అరెస్ట్ చేశారు.
Updated Date - Aug 18 , 2024 | 03:51 AM