Bhatti Vikramarka: 12 నుంచి 14 సీట్లు కాంగ్రెస్ గెలుస్తాం...
ABN, Publish Date - May 14 , 2024 | 04:12 PM
Telangana: జిల్లాలోని కాటారం మండలం దన్వాడలో శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు దర్శించుకున్నారు. శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయ 3వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోవడంతో తన జన్మదన్యమైందన్నారు.
జయశంకర్ భూపాలపల్లి, మే 14: జిల్లాలోని కాటారం మండలం దన్వాడలో శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka), మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) దర్శించుకున్నారు. శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయ 3వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోవడంతో తన జన్మదన్యమైందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారని అర్ధమవుతుందని తెలిపారు. రాష్ట్రంలో సుమారు12 నుంచి 14 సీట్లు కాంగ్రెస్ (Congress) గెలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు.
AP Election 2024: కూటమి గెలుపునకు వైసీపీ కారణం..
రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేసిన బస్సుయాత్ర, పాదయాత్రతో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడబోతోందన్నారు. రాహుల్ పోరాటాల ఫలితాలు.. కాంగ్రెస్ నాయకత్వంలో ఇండియా కూటమి ప్రజలు ఓట్ల ద్వారా చూపిస్తున్నారని తెలిపారు. కొన్ని పార్టీలు అన్ని బావజాలలను పక్కనపెట్టి ప్రజల్లో సెంటిమెంట్‌ను రెచ్చగొట్టడానికి చూశాయని మండిపడ్డారు. ప్రజలు మాత్రం ఇండియా కూటమి వైపే మొగ్గు చూపారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
Indigo Flight: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో నిలిచిన ఇండిగో విమానం...
Jaggareddy: బీఆర్ఎస్, బీజేపీ నుంచి టచ్‌లోకి ఎమ్మెల్యేలు.. జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్
Read Telangana News And Telugu News
Updated Date - May 14 , 2024 | 04:15 PM