ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bhadradri: రైతు ప్రభాకర్‌ కుటుంబాన్ని ఆదుకుంటాం: భట్టి

ABN, Publish Date - Jul 08 , 2024 | 04:38 AM

భద్రాద్రి జిల్లా చింతకాని మండలం పొద్దుటూరు రైతు బోజడ్ల ప్రభాకర్‌ ఆత్మహత్యకు పురిగొల్పినవారిని ఉపేక్షించేది లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రభాకర్‌ ఆత్మహత్య బాధాకరమని, ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.

చింతకాని, ఖమ్మంకార్పొరేషన్‌/చింతకాని, జూలై 7: భద్రాద్రి జిల్లా చింతకాని మండలం పొద్దుటూరు రైతు బోజడ్ల ప్రభాకర్‌ ఆత్మహత్యకు పురిగొల్పినవారిని ఉపేక్షించేది లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రభాకర్‌ ఆత్మహత్య బాధాకరమని, ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. రైతు ప్రభాకర్‌ వ్యవసాయ భూమిని పరిశీలించిన అనంతరం ఆయన రైతు ఇంటికి వెళ్లి ప్రభాకర్‌ చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క విలేకరులతో మాట్లాడుతూ.. రైతు ఆత్మహత్యకు ప్రేరేపించిన వారు ఎవరైనా, ఎంత పెద్దవారైనా, ఏ పార్టీ వారైనా నిష్పక్షపాతంగా విచారణ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించానన్నారు.


ప్రభాకర్‌ పిల్లలు చదువులకు అవసరమైన ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తుందన్నారు. కాగా, రైతు ప్రభాకర్‌ ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని బీఆర్‌ఎస్‌ నాయకులు ఖమ్మం పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌దత్‌ను కోరారు. ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, మాజీమంత్రి నిరంజన్‌రెడి తదితరులుసీపీని కలిసి వినతిపత్రం అందజేశారు.

Updated Date - Jul 08 , 2024 | 04:38 AM

Advertising
Advertising
<