ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bhatti: బీజేపీ చెబితే.. కేసీఆర్‌ వచ్చారు..

ABN, Publish Date - Jul 26 , 2024 | 03:46 AM

బీజేపీవాళ్లు చెబితేనే.. మాజీ సీఎం కేసీఆర్‌ అసెంబ్లీకి వచ్చారని, మీడియా పాయింట్‌ వద్ద బడ్జెట్‌పై మాట్లాడారని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఆరోపించారు.

  • పూర్తి ప్రసంగం వినకుండానే వెళ్లిపోయారు

  • విలేకరులతో ఇష్టాగోష్ఠిలో డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్‌, జూలై 25 (ఆంధ్రజ్యోతి): బీజేపీవాళ్లు చెబితేనే.. మాజీ సీఎం కేసీఆర్‌ అసెంబ్లీకి వచ్చారని, మీడియా పాయింట్‌ వద్ద బడ్జెట్‌పై మాట్లాడారని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఆరోపించారు. అయితే పూర్తి బడ్జెట్‌ ప్రసంగాన్ని వినకుండా మధ్యలోనే వెళ్లిపోయారని, అడ్డగోలుగా గాలిమాటలు మాట్లాడారని అన్నారు. పూర్తిగా వినకపోతే బడ్జెట్‌పై అవగాహన ఎలా వస్తుందన్నారు. హడావుడిగా వచ్చి.. వెళ్లేందుకైతే అసలు రావడమెందుకని ప్రశ్నించారు. ప్రజలపై, రాష్ట్ర బడ్జెట్‌పై అభిమానం ఉంటే పూర్తిగా వినాలని హితవు పలికారు. గురువారం అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరం డిప్యూటీ సీఎం.. అసెంబ్లీ కమిటీ హాల్‌-1లో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. తెలంగాణ కోసం పోరాడానని చెప్పుకొనే వ్యక్తి.. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై బుధవారం అసెంబ్లీలో తీర్మానం పెడితే ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఆరు నెలలపాటు కాంగ్రెస్‌కు సమయం ఇచ్చామని కేసీఆర్‌ అంటున్నారని, నిజానికి ప్రజలే వారిని ఓడించి, పూర్తిగా విశ్రాంతినిచ్చారని ఎద్దేవా చేశారు.


దళితబంధుకు రూ.17,700 కోట్లు కేటాయించి ఒక్క రూపాయి కూడా విడుదల చేయని కేసీఆర్‌.. ఈ బడ్జెట్లో దళితబంధు పథకాన్ని ప్రస్తావించలేదని మాట్లాడుతుంటే నవ్వాలో? ఏడ్వాలో? అర్థం కావడం లేదన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులను గత ప్రభుత్వం మాదిరిగా తాము మళ్లించబోమన్నారు. బ్యాక్‌లాగ్‌ నిధులతో సహా ప్రతి పైసాను దళిత, గిరిజనుల ప్రయోజనాల కోసమే ఖర్చు చేస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోయే స్కిల్‌ యూనివర్సిటీకి ‘యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ’గా నామకరణం చేశామన్నారు. కోటి మంది మహిళలను లక్షాధికారులుగా తయారు చేయడానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించామని, ఏటా మహిళా సంఘాలకు రూ.20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో సూక్ష్మ, చిన్న తరహా పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయబోతున్నామన్నారు.

Updated Date - Jul 26 , 2024 | 03:46 AM

Advertising
Advertising
<