ధరణి పోర్టల్ తాత్కాలిక బంద్
ABN, Publish Date - Dec 13 , 2024 | 04:28 AM
ధరణి పోర్టల్ సేవలు సాంకేతిక కారణాల రీత్యా నాలుగు రోజుల పాటు అందుబాటులో ఉండవని ప్రధాన భూ పరిపాలనా కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది.
16వ తేదీ ఉదయం వరకు..
డేటాబేస్ వెర్షన్ అప్‌గ్రేడ్ వల్లే..
హైదరాబాద్, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ధరణి పోర్టల్ సేవలు సాంకేతిక కారణాల రీత్యా నాలుగు రోజుల పాటు అందుబాటులో ఉండవని ప్రధాన భూ పరిపాలనా కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. 12వ తేదీ గురువారం సాయంత్రం 5 గంటల నుంచి 16వ తేదీ సోమవారం ఉదయం వరకు సేవలు అందుబాటులో ఉండవని తెలిపింది. ధరణి పోర్టల్ డేటాబేస్ వెర్షన్ అప్‌గ్రేడ్ చేస్తున్నందున ఈ అంతరాయం ఏర్పడిందని పేర్కొంది. సాంకేతిక సమస్యల వల్ల తలెత్తిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, సోమవారం ఉదయం నుంచి సేవల పునరుద్ధరణ ఉంటుందని వివరించింది. ధరణి పోర్టల్ డిసెంబరు 1 నుంచి జాతీయ సమాచార కేంద్రం(ఎన్‌ఐసీ) నిర్వహణలోకి వచ్చిన విషయం విదితమే.
Updated Date - Dec 13 , 2024 | 09:10 AM