ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Doctor: కార్‌ డ్రైవింగ్‌ చేస్తుండగా గుండెపోటు

ABN, Publish Date - Nov 02 , 2024 | 05:25 AM

కారు డ్రైవింగ్‌ చేస్తుండగా హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఓ వైద్యుడు మృతిచెందిన ఘటన మెదక్‌ జిల్లా అల్లాదుర్గం మండలం చిల్వర్‌ సమీపంలో జరిగింది.

  • ఈఎస్ఐ డాక్టర్‌ మృతి

అల్లాదుర్గం, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): కారు డ్రైవింగ్‌ చేస్తుండగా హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఓ వైద్యుడు మృతిచెందిన ఘటన మెదక్‌ జిల్లా అల్లాదుర్గం మండలం చిల్వర్‌ సమీపంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా జూక్కల్‌ మండలం పెద్దఎడిగి గ్రామానికి చెందిన డాక్టర్‌ శ్రీనివాస్‌ (40) సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం ఈఎ్‌సఐ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఆయన స్వగ్రామానికి వెళ్లి, శుక్రవారం ఉదయం తిరిగి ఆస్పత్రికి వెళ్తున్న క్రమంలో చిల్వర్‌ గ్రామ సమీపంలో ఆకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది.


దీంతో ఆయన తన కారును 161వ జాతీయ రహదారి పక్కన ఆపివేశారు. అటుగా వెళ్తున్న గ్రామస్థులు గమనించి 108కు సమాచారం అందించగా, వారు వచ్చి జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే చనిపోయినట్లు ధ్రువీకరించారు. డాక్టర్‌ శ్రీనివాస్‌ భార్య సీత బింధు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Nov 02 , 2024 | 05:25 AM