Doctors: జూనియర్ వైద్యుల పనివేళలు తగ్గించాలి
ABN, Publish Date - Sep 15 , 2024 | 03:40 AM
జూనియర్ డాక్టర్లపై పనిభారం పెరుగుతోందని, వారి పనివేళలు వారంలో 72 గంటల నుంచి 48 గంటలకు తగ్గించాలని కేంద్ర ఆర్యోగ కమిటీ సభ్యుడు డాక్టర్ కిరణ్ మాదాల కేంద్రాన్ని కోరారు.
72 గంటల నుంచి 48 గంటలకు కుదించాలి
కేంద్ర ఆర్యోగ కమిటీ సభ్యుడు డాక్టర్ కిరణ్ మాదాల
హైదరాబాద్, సెప్టెంబరు 14(ఆంధ్రజ్యోతి): జూనియర్ డాక్టర్లపై పనిభారం పెరుగుతోందని, వారి పనివేళలు వారంలో 72 గంటల నుంచి 48 గంటలకు తగ్గించాలని కేంద్ర ఆర్యోగ కమిటీ సభ్యుడు డాక్టర్ కిరణ్ మాదాల కేంద్రాన్ని కోరారు. ఢిల్లీలో జరిగిన కేంద్ర ఆరోగ్య కమిటీ సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న జూనియర్ వైద్యులపై తీవ్రమైన పనిభారం పడుతోందని దీంతో వారు ఒత్తిడి లోనవుతున్నారని అన్నారు.
అలాగే అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో తగినంత మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సీనియర్ వైద్యులను నియమించాలని కోరారు. దీంతో జూనియర్ వైద్యులపై పనిభారం తగ్గుతుందని తద్వారా ప్రజలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని పేర్కొన్నారు.
Updated Date - Sep 15 , 2024 | 03:40 AM