శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత
ABN, Publish Date - Nov 02 , 2024 | 03:45 AM
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి. రూ.7 కోట్ల విలువైన డ్రగ్స్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
రూ.7కోట్ల విలువైన మత్తు పదార్థాలు..
బ్యాంకాక్ నుంచి తెస్తూ పట్టుబడ్డ ఇద్దరు మహిళలు
శంషాబాద్ రూరల్, నవంబరు 1 ( ఆంరఽధజ్యోతి ): రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి. రూ.7 కోట్ల విలువైన డ్రగ్స్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికారుల వివరాల ప్రకారం... నగరానికి చెందిన ఇద్దరు మహిళా ప్రయాణికులు గురువారం తెల్లవారుజామున బ్యాంకాక్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగారు. అధికారులు వారి బ్యాగులు తనిఖీ చేయగా అందులో హైడ్రోఫోనిక్ వీడ్ కలిపిన మూటను గుర్తించారు. అందులో కెల్లోస్ చాక్లెట్ ప్యాకెట్లలో 13 వ్యాక్యూమ్‌లు కనిపించాయి. వాటిని ప్రత్యేక పరికరంతో పరీక్షించగా డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు. దాని బరువు దాదాపు 7.096 కేజీలుగా ఉంది. మార్కెట్ విలువ దాదాపు రూ.7 కోట్లు ఉంటుందని డీఆర్‌ఐ అధికారులు అంచనా వేశారు. మహిళా ప్రయాణికులను అదుపులోకి తీసుకుని విచారించగా డ్రగ్స్ తీసుకొస్తున్నట్లు అంగీకరించారు. దీని వెనకాల ఎవరి హస్తం ఉంది? ఎక్కడి నుంచి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు? ఇందులో ఎంతమంది పాత్ర ఉంది? అనే కోణంలో అధికారులు విచారణ చేపట్టారు. పట్టుబడిన డ్రగ్స్‌ను సీజ్ చేశారు. శుక్రవారం ఆ ఇద్దరు మహిళలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Updated Date - Nov 02 , 2024 | 03:45 AM