ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Dasara 2024: దసరా వేళ.. సామాన్యుడు ఉక్కిరి బిక్కిరి

ABN, Publish Date - Oct 07 , 2024 | 06:15 PM

రూ. 500 కాగితం తీసుకుని కూరగాయల మార్కెట్‌కు వెళ్లితే.. పట్టుమని మూడు రకాలు కాయగూరలు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవే కాదు.. ఉల్లి, వెల్లుల్లి, అల్లం ధరలు సైతం ఇదే తరహాలో కొనసాగుతున్నాయని వారు వివరిస్తున్నారు.

దసరా పండగ వేళ.. పాఠశాలలు సెలవులు ఇచ్చేశారు. దీంతో పిల్లలకు ఏదైనా పిండి వంట చేద్దామంటే.. ఆ పరిస్థితులు అయితే ప్రస్తుతం లేవని పలువురు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పప్పులు ఉప్పులు రేట్లు ఆకాశాన్నంటుతున్నాయని వారు పేర్కొంటున్నారు. ఇక వంట నూనెల ధరలు సైతం భారీగా పెరిగి సలసల కాగుతున్నాయంటున్నారు. పోనిలే కూరగాయలు తీసుకు వద్దామని బజారుకు సంచి తీసుకు వెళ్తితే కిలో టమాట ధర రూ. 100. బీర, వంకాయి, బెండా, బంగాళ దుంప తదితర కాయగూరల ధరలు సైతం అదే రేంజ్‌లో ఉన్నాయని పెదవి విరుస్తున్నారు.

Also Read: Dasara Navaratri 2024: ఆరో రోజు.. ఈ అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్న అమ్మ వారు


రూ. 500 కాగితం తీసుకుని కూరగాయల మార్కెట్‌కు వెళ్లితే.. పట్టుమని మూడు రకాలు కాయగూరలు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవే కాదు.. ఉల్లి, వెల్లుల్లి, అల్లం ధరలు సైతం ఇదే తరహాలో కొనసాగుతున్నాయని వారు వివరిస్తున్నారు.

Also Read: Batti Vikramarka: ప్రజా అజెండా తప్పా.. వ్యక్తిగత అజెండా లేదు


ఇక దసరా పండగ వేళ.. ఒక్క పచ్చి మిర్చి ధర మాత్రమే తగ్గిందని వారు చమత్కరిస్తున్నారు. కేజీ పచ్చి మిర్చి ధర రూ.30 లేదా రూ.40 మాత్రమే ఉందని వారు వివరిస్తున్నారు. అయితే పచ్చి మిర్చితో ఏ వంటకం చేసుకోలేని పరిస్థితి అయితే నెలకొందని వారు వివరిస్తున్నారు. ఏ వంట వండుకుని తినాలన్నా.. కచ్చితంగా నూనె అవసరమని వారు స్పష్టం చేస్తున్నారు. లీటర్ నూనె ప్యాకెట్ ధర భారీగా పెరిగిందని చెబుతున్నారు.

Also Read: Amith Shah: ముగిసిన భేటీ.. మావోయిస్టులపై కీలక వ్యాఖ్యలు


ఈ తరహాలో పప్పులు, ఉప్పులు, నూనెలు ధరలు మండిపోతుంటే.. పేదలు, నిరూపేదలు, మధ్యతరగతి జీవులు బతికేది ఎట్లా అని వారు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఈ ఏడాది దసరా అయితే వచ్చింది.. కానీ తమకు పండగ మాత్రం రాలేదని వారు క్లియర్ కట్‌గా స్పష్టం చేస్తున్నారు. అన్ని రకాల వంట నూనెలు నిన్న మొన్నటి వరకు తక్కువగానే ఉండేవన్నారు. కానీ నేడు వాటి ధరలు ఒక్కసారిగా పెరిగి పోవడం పట్ల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: మోకాళ్ల నొప్పులు తగ్గాలంటే.. ఇవి తీసుకోకండి..


ఇక పండగ వేళ.. సొంత ఊర్లకు వెళ్దామన్నా.. బస్సులు, రైళ్లలో రిజర్వేషన్లు నిండుకున్నాయని వారు పేర్కొంటున్నారు. దీంతో ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తే.. మాత్రం తమకు వీర బాదుడు తప్పదని వారు స్పష్టం చేస్తున్నారు. అయినా ఎన్నికలు అయిపోయాయి.. రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. దీంతో తమతో ఇంకా ఈ ప్రభుత్వాలకు ఏం పని అని మధ్య తరగతి జీవులు ఓ విధమైన నిర్వేదంతో ప్రశ్నిస్తున్నారు.

ఉచిత పథకాల పేరుతో కొందరికి ఏదో ఒకటి తాయిలంగా ఇచ్చి.. నిత్యవసర వస్తువుల ధరలు భారీగా పెంచడం ద్వారా తమ నడ్డి విరుస్తున్నారంటూ సగటు జీవి ఆవేదనతో కూడిన ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.

For Telangana News And Telugu News...

Updated Date - Oct 07 , 2024 | 06:15 PM