ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TS: ఓటరు అత్యుత్సాహం..

ABN, Publish Date - May 14 , 2024 | 04:40 AM

లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా కొందరు ఓటర్లు అత్యుత్సాహం చూపారు. పోలింగ్‌ కేంద్రంలోకి సెల్‌ఫోన్‌ తీసుకెళ్లి నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారు. మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదురు మండలం హేమ్లాతండాలోని 160వ బూత్‌కు ఓటేయడానికి వచ్చిన బానోత్‌ బాలకృష్ణ..ఓటు వేస్తూ మొబైల్‌లో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశాడు.

  • సెల్ఫీలు, వీడియోలు తీసిన పలువురిపై కేసు

    లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా కొందరు ఓటర్లు అత్యుత్సాహం చూపారు. పోలింగ్‌ కేంద్రంలోకి సెల్‌ఫోన్‌ తీసుకెళ్లి నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారు. మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదురు మండలం హేమ్లాతండాలోని 160వ బూత్‌కు ఓటేయడానికి వచ్చిన బానోత్‌ బాలకృష్ణ..ఓటు వేస్తూ మొబైల్‌లో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశాడు. ప్రిసైడింగ్‌ అధికారి ఫిర్యాదు చేయడంతో బాలకృష్ణపై కేసు నమోదైంది.


నల్లగొండ జిల్లా యాద్గార్‌పల్లి 164 పోలింగ్‌ స్టేషన్‌లో ఓటు వేసిన వస్కుల మధు వీవీ ప్యాట్‌లోని స్లిప్‌ను ఫొటో తీసి వాట్సాప్‌ స్టేట్‌సగా పెట్టాడు. మధుపై కేసు నమోదైంది. భద్రాద్రి జిల్లా పెగళ్లపాడుకు చెందిన జాటోత్‌ నరేష్‌ 169వ పోలింగ్‌ బూత్‌లో ఓ యువకుడు ఓటు వేస్తుండగా ఫొటోలు తీశాడు. టేకులపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. మెదక్‌ జిల్లా బ్రాహ్మణపల్లిలో గణేష్‌ ఓటు వేస్తూ సెల్ఫీ తీసుకుని సోషల్‌ మీడియాలో పెట్టాడు. పోలీసులు సదరు యువకుడిపై కేసు నమోదు చేశారు.

Updated Date - May 14 , 2024 | 04:40 AM

Advertising
Advertising