Travel Demand: దసరాకు సొంతూళ్లకు పయనం
ABN, Publish Date - Oct 11 , 2024 | 03:59 AM
దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్‌లో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు.
బస్సులు, రైళ్లలో పెరిగిన రద్దీ.. వెయ్యికిపైగా స్పెషల్ బస్సులేసిన టీజీఎ్‌సఆర్టీసీ
1,400 ప్రత్యేక రైళ్ల ఏర్పాటు
చార్జీల బాదుడుపై ప్రయాణికుల ఆగ్రహం
హైదరాబాద్ సిటీ, అక్టోబరు 10 (ఆంధజ్యోతి): దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్‌లో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. ప్రధాన బస్టాండ్లపై రద్దీని తగ్గిస్తూ ఎంజీబీఎస్, జేబీఎ్‌సతో పాటు ఉప్పల్ క్రాస్‌రోడ్, ఎల్ బీనగర్, ఆరాంఘర్, కూకట్‌పల్లి, గచ్చిబౌలి, బోయిన్‌పల్లి, జగద్గిరిగుట్ట, సుచిత్ర, ఐఎ్‌ససదన్, బొరబండ, శంషాబాద్‌ల నుంచి జిల్లాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి 10 గంటల వరకు వెయ్యికిపైగా ప్రత్యేక బస్సులు తెలంగాణ, ఏపీ జిల్లాలకు తరలి వె ళ్లాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
సొంతూళ్లకు వెళ్లిన ప్రయాణికులు హైదరాబాద్‌కు తిరిగి వచ్చేందుకు వీలుగా అక్టోబరు 13, 14వ తేదీల వరకు ఈ బస్సులు నడపనున్నట్లు వారు వెల్లడించారు. అయితే ప్రత్యేక బస్సుల్లో 50 శాతం చార్జీలు పెంచడంపై ప్రయాణికులు అగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది సాధారణ చార్జీలతో బస్సులు నడిపిన ఆర్టీసీ ఈ సంవత్సరం ఎందుకు చార్జీలు పెంచిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. కొంతమంది ప్రైవేటు వాహనాల్లో సొంతూళ్లకు వెళ్తుండడంతో ప్రధానరహదారులపై వాహనాల రద్దీ రెట్టింపు స్థాయిలో పెరిగింది.
మరోవైపు దసరా, దీపావళి పండగల సందర్భంగా ఆయా ప్రాంతాలకు వెళ్లి వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం వేర్వేరు ప్రాంతాల నుంచి 1400 ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ వెల్లడించారు. రద్దీ ఉన్న స్టేషన్లలో అదనపు బుకింగ్ కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే మార్గాలను నిరంతరం పర్యవేక్షిస్తూ అదనపు రైళ్లను సమర్థవంతంగా నడిపేందుకు చర్యలు చేపట్టామని జీఎం అరుణ్‌కుమార్ పేర్కొన్నారు.
Updated Date - Oct 11 , 2024 | 03:59 AM