MLC Kavitha: కవిత్ అరెస్ట్.. కేటీఆర్‌పై పోలీసులకు ఈడీ ఫిర్యాదు
ABN, Publish Date - Mar 15 , 2024 | 09:52 PM
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత అరెస్ట్ అనంతరం కీలక పరిణామం చోటుచేసుకుంది. కవిత సోదరుడు, మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై బంజారాహిల్స్ పోలీసులకు ఈడీ అధికారులు ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత (MLC Kavitha) అరెస్ట్ అనంతరం కీలక పరిణామం చోటుచేసుకుంది. కవిత సోదరుడు, మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై బంజారాహిల్స్ పోలీసులకు ఈడీ అధికారులు ఫిర్యాదు చేశారు. కవిత అరెస్ట్ సమయంలో కేటీఆర్ తమ విధులకు ఆటంకం కల్గించారని ఈడీ ఆఫీసర్ భాను ప్రియా మీనా ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా కవిత అరెస్ట్ సమయంలో ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వాదానికి దిగారు. సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కవితను ఎలా అరెస్ట్ చేస్తారంటూ నిలదీశారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఈడీ అధికారులు బంజరాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయంపై పోలీసులు ఎలా రియాక్టవుతారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
కాగా శుక్రవారం సాయంత్ర 5.20 గంటలకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితను అరెస్ట్ చేసిన ఈడీ ఢిల్లీకి తీసుకెళ్లింది. మరోవైపు కవిత సోదరుడు కేటీఆర్ కూడా ఢిల్లీకి బయల్దేరారు. కవిత అరెస్ట్‌కు ముందు ఈడీ, ఐటీ అధికారులు కవిత ఇంట్లో సుమార్ 4 గంటలపాటు సోదాలు నిర్వహించారు. పలు కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అరెస్ట్ నోటీసులిచ్చి కవితను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రులు, కవిత కుటుంబసభ్యులు కేటీఆర్, హరీష్ రావు అక్కడికి చేరుకున్నారు. మొదట వారిని ఈడీ అధికారులు కవిత ఇంట్లోకి అనుమతించలేదు. అయితే ఈడీ అధికారులతో వారించి వారు ఇంట్లోకి చేరుకున్నారు. అనంతరం ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వాదానికి దిగారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Mar 15 , 2024 | 09:52 PM