ED: అమేయకుమార్ కేసులో కొత్త మలుపు
ABN, Publish Date - Dec 14 , 2024 | 05:12 AM
ఐఏఎస్ అధికారి అమేయకుమార్‌పై నమోదైన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. మహేశ్వరం మండలం నాగారంలో 50 ఎకరాల భూదాన్ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన వ్యవహారంలో అమేయకుమార్‌పై ఈడీ దర్యాప్తు చేపట్టింది.
మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి ఈడీ సమన్లు
వంశీరాం బిల్డర్స్ అధినేత సుబ్బారెడ్డి, మరో ఇద్దరు బిల్డర్లకూ.. ఈ నెల 16న విచారణ
హైదరాబాద్, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): ఐఏఎస్ అధికారి అమేయకుమార్‌పై నమోదైన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. మహేశ్వరం మండలం నాగారంలో 50 ఎకరాల భూదాన్ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన వ్యవహారంలో అమేయకుమార్‌పై ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి విచారణలో తేలిన అంశాల ఆధారంగా బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, వంశీరాం బిల్డర్స్ అధినేత సుబ్బారెడ్డి, కేఎ్‌సఆర్ మైన్ ్స కె.సిద్ధారెడ్డి, అమ్మద డెవలపర్స్ సూర్యతేజలకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 16 నుంచి విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. అమేయకుమార్ ద్వారా వీరు లబ్ధి పొందారని ఈడీ గుర్తించినట్లు సమాచారం. భూదాన్ భూములను ప్రైవేట్ పట్టా భూములుగా మార్చడం, వాటికి రిజిస్ట్రేషన్లు జరగడం వెనుక వంద కోట్ల రూపాయల వరకు చేతులు మారినట్లు ఆరోపణలు వచ్చిన నేపఽథ్యంలో దస్తగిరి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు మహేశ్వరం పోలీసులు కేసు నమోదు చేశారు.
Updated Date - Dec 14 , 2024 | 05:12 AM