ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TG: ఎండ @ 47.1 డిగ్రీలు..

ABN, Publish Date - Jun 01 , 2024 | 05:15 AM

రాష్ట్రంలో రోహిణి కార్తె ప్రభావం కనిపిస్తోంది. సూర్యుడి భగభగలతో ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం, వేడి గాలులు వీస్తుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రాష్ట్రంలోని 20 ప్రాంతాల్లో శుక్రవారం 46 డిగ్రీలకు పైబడి గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

  • తెలంగాణ వ్యాప్తంగా మండిన సూరీడు

  • 20 చోట్ల 46 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు

  • వడదెబ్బకు గురై 11 మంది మృతి

  • నేడు, రేపు రాష్ట్రానికి వర్ష సూచన

  • మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం

  • (ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

రాష్ట్రంలో రోహిణి కార్తె ప్రభావం కనిపిస్తోంది. సూర్యుడి భగభగలతో ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం, వేడి గాలులు వీస్తుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రాష్ట్రంలోని 20 ప్రాంతాల్లో శుక్రవారం 46 డిగ్రీలకు పైబడి గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శుక్రవారం రాష్ట్రంలోనే అత్యధికంగా మంచిర్యాల జిల్లా భీమారం, పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌లో 47.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో, భద్రాద్రి కొత్తగూడెంలో 46.9, నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం, ఖమ్మం జిల్లాలో 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. పాతమంచిర్యాలలో 46.7, పెద్దపల్లి జిల్లా ముత్తారంలో 46.6, మంచిర్యాల జిల్లా హాజీపూర్‌లో 46.5, జగిత్యాల జిల్లా నేరెళ్లలో 46.4, సూర్యాపేట జిల్లా కోదాడలో 46.4డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే, నల్లగొండ జిల్లా దామచర్లలో 46.3, కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో 46 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఇక, రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనే అత్యధికంగా మలక్‌పేట ప్రాంతంలో 43.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.


  • వడదెబ్బకు 11 మంది మృత్యువాత

వడదెబ్బకు గురై రాష్ట్రంలో శుక్రవారం 11 మంది ప్రాణాలు కోల్పోయారు. వరంగల్‌ జిల్లా చెన్నారావుపేటకు చెందిన పల్లకొండ ఐలయ్య(75),ములుగు జిల్లా మంగపేట మండలం రాజుపేటకు చెందిన దామెర రాంబాబు(50) అనే ప్రైవేట్‌ ఎలక్ట్రీషియన్‌, నల్లగొండ జిల్లా చిట్యాలకు చెందిన కర్రి రాజు (40), గుర్రంపోడుకు చెందిన రేపాక ముత్తమ్మ(64), మునుగోడు మండలం ఊకొండికి చెందిన కమ్మాలపల్లి మమత(30), వడదెబ్బకు గురై మరణించారు. ధాన్యం విక్రయించేందుకు ఐదు రోజులుగా ఐకేపీ కేంద్రం వద్దే ఉంటున్న సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్షీపూర్‌కు చెందిన మల్లీ కల్పన(24) వడదెబ్బకు గురై మరణించింది. పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్‌లోని సిమెంట్‌ పరిశ్రమలో లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్న మధ్యప్రదేశ్‌కు చెందిన జాకీర్‌ హుస్సేన్‌(60) కరీంనగర్‌ జిల్లా చొప్పదండికి సిమెంట్‌ లోడు తీసుకెళ్లి వడదెబ్బకు ప్రాణాలు కోల్పోయాడు. కరీంనగర్‌ జిల్లా వీణవంకకు చెందిన కళ్యాణం రామక్క (75). పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్‌కు చెందిన ఈదునూరి కిషోర్‌(34), మంచిర్యాల జిల్లా కాసిపేటకు చెందిన దుర్గం భీమయ్య (55), ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ మండలంలోని నాగోబా తండాకు చెందిన ఆత్రం లింబారావు(23) శుక్రవారం మరణించారు.


నేడు, రేపు పలు ప్రాంతాల్లో వర్షాలు

భానుడి భగభగలతో రెండ్రోజులుగా అల్లాడిపోతున్న ప్రజలకు చల్లని కబురు. శనివారం నుంచి ఎండల తీవ్రత కాస్త తగ్గనుంది. శని, ఆదివారాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల్లోపే నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదివారం కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇక నైరుతి రుతుపవనాలు శనివారం కేరళలోని మిగిలిన ప్రాంతాలు, తమిళనాడు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

Updated Date - Jun 01 , 2024 | 05:15 AM

Advertising
Advertising