ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nagar Kurnool: 3 రోజులుగా వాగులో బిక్కుబిక్కుమంటూ..

ABN, Publish Date - Sep 03 , 2024 | 04:08 AM

నలువైపులా వాగు ఉధృతితో ఎటూ వెళ్లలేక.. ఓ పెద్ద గెట్టుపై ఎనిమిది మంది చిక్కుకుపోయారు!

  • 8మంది చెంచుల అవస్థ.. బాధితుల్లో ముగ్గురు పిల్లలు

  • పనులకు వెళితే దుందుభి వాగు ఉధృతికి నీళ్లు

  • అచ్చంపేట మండలం సిద్దాపూర్‌ సమీపంలో ఘటన

  • ఆ వైపు వచ్చిన రైతులను చూసి బిగ్గరగా కేకలు

  • డ్రోన్లద్వారా ఆహారం అందించే ప్రయత్నాలు

అచ్చంపేట టౌన్‌, సెప్టెంబరు 2: నలువైపులా వాగు ఉధృతితో ఎటూ వెళ్లలేక.. ఓ పెద్ద గెట్టుపై ఎనిమిది మంది చిక్కుకుపోయారు! శనివారం వారు వాగులో వారు చిక్కుకుపోతే ఈ విషయం బయట ప్రపంచానికి సోమవారం తెలిసింది! దుందుభి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో నాగర్‌కర్నూలు జిల్లా సిద్దాపూర్‌ సమీపంలోని కత్వలో ఆ బాధితులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వరదలో చిక్కుపోయిన వారిలో ముగ్గురు పిల్లలు, ఓ మహిళ ఉన్నారు! బాధితులంతా నల్లగొండ జిల్లా డిండి మండలం గోనబోయిపల్లి గ్రామానికి చెందిన చెంచులు! వీరంతా శనివారం వ్యవసాయ పనుల్లో ఉండగా శనివారం భారీవర్షం కురిసింది.


వాగులు పొంగిపొర్లడంతో గ్రామానికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. సొంతూరువైపు కాకుండా నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం బొమ్మన్‌పల్లి గ్రామం మీదుగా వెళ్లేందుకు ప్రయత్నించారు. మార్గమధ్యలో దుందుభి వాగు ఉధృతికి సిద్దాపూర్‌ సమీపంలోని కత్వ వద్ద బండరాళ్లపై ఉండిపోయారు. సోమవారం సాయంత్రం సిద్దాపూర్‌ గ్రామానికి చెందిన రైతులు వ్యవసాయ పొలాలకు వెళ్లడంతో బాధితులు వారిని చూసి బిగ్గరగా కేకలు వేశారు. ఆ రైతులు విషయాన్ని సిద్దాపూర్‌ పోలీసులకు చేరవేశారు. అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ రవీందర్‌ తమ సిబ్బందితో కలిసి అక్కడకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటం.. రాత్రి కావడంతో బాధితులను కాపాడే పరిస్థితి కనబడలేదు. అయితే బాధితులకు డ్రోన్ల సాయంతో ఆహారం అందించే ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - Sep 03 , 2024 | 04:08 AM

Advertising
Advertising