ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: ‘విద్యుత్‌ విచారణ’ షురూ!

ABN, Publish Date - May 17 , 2024 | 03:19 AM

యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ ప్లాంట్ల నిర్మాణ పనులను నామినేషన్‌ పద్ధతిలో కట్టబెట్టడం, అవసరం లేకున్నా ఛత్తీ్‌సగఢ్‌తో విద్యుత్‌ ఒప్పందం చేసుకోవడం వంటి కారణాలతో జరిగిన నష్టంపై 10 రోజుల్లోగా (ఈ నెల 16 నుంచి) ఫిర్యాదు చేయాలని జస్టిస్‌ ఎల్‌.నర్సింహారెడ్డి కమిషన్‌ కోరింది. ఈ మేరకు గురువారం బహిరంగ ప్రకటన ఇచ్చింది. పోటీ బిడ్డింగ్‌ ద్వారా కాకుండా నామినేషన్‌ ప్రాతిపదికన ఛత్తీ్‌సగఢ్‌తో విద్యుత్‌ ఒప్పందం చేసుకోవడం, సూపర్‌ క్రిటికల్‌ టెక్నాలజీతో ప్లాంట్లు కడుతుండగా..

  • ఛత్తీస్‌గఢ్‌తో ఒప్పందంపై ఫిర్యాదుల స్వీకరణ

  • యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ ప్లాంట్ల నిర్మాణంపైనా

  • నోటిఫికేషన్‌ ఇచ్చిన నర్సింహారెడ్డి కమిషన్‌

హైదరాబాద్‌, మే 16 (ఆంధ్రజ్యోతి): యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ ప్లాంట్ల నిర్మాణ పనులను నామినేషన్‌ పద్ధతిలో కట్టబెట్టడం, అవసరం లేకున్నా ఛత్తీ్‌సగఢ్‌తో విద్యుత్‌ ఒప్పందం చేసుకోవడం వంటి కారణాలతో జరిగిన నష్టంపై 10 రోజుల్లోగా (ఈ నెల 16 నుంచి) ఫిర్యాదు చేయాలని జస్టిస్‌ ఎల్‌.నర్సింహారెడ్డి కమిషన్‌ కోరింది. ఈ మేరకు గురువారం బహిరంగ ప్రకటన ఇచ్చింది. పోటీ బిడ్డింగ్‌ ద్వారా కాకుండా నామినేషన్‌ ప్రాతిపదికన ఛత్తీ్‌సగఢ్‌తో విద్యుత్‌ ఒప్పందం చేసుకోవడం, సూపర్‌ క్రిటికల్‌ టెక్నాలజీతో ప్లాంట్లు కడుతుండగా... దాన్ని కాదని సబ్‌ క్రిటికల్‌ టెక్నాలజీతో భద్రాద్రి థర్మల్‌ ప్లాంట్‌ను కట్టడం, కోల్‌బెల్ట్‌కు 179 నుంచి 388 కిలోమీటర్ల దూరంలో యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ నిర్మాణం చేపట్టడంపై ప్రభుత్వం జస్టిస్‌ ఎల్‌.నర్సింహారెడ్డి నేతృత్వంలో కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం విదితమే.


ఈ మేరకు ఆయా ఒప్పందాల వల్ల జరిగిన నష్టంపై నివేదించాలని కమిషన్‌ సూచించింది. ఈ మెయిల్‌ (ఛిౌజీ2024.ఞౌఠ్ఛీటఃజఝ్చజీజూ.ఛిౌఝ)కు లేదా కమిషన్‌ కార్యాలయం, 7వ అంతస్తు, బీఆర్‌కేఆర్‌ భవన్‌, ఆదర్శ నగర్‌, హైదరాబాద్‌-500004 చిరునామాకు రాతపూర్వక ఫిర్యాదులను 5 లేదా 6 పేజీల్లో పంపాలని కోరారు. ఇక నివేదించే వారు లేదా ఎటువంటి రాజకీయాలతో సంబంధం లేకుండా, వ్యక్తులు లేదా అధికారులను టార్గెట్‌ చేసుకోకుండా ఫిర్యాదు చేయాలని కమిషన్‌ కోరింది.

ఎవరైనా మౌఖిక సాక్ష్యాలు ఇవ్వాలని భావిస్తే వాటి ఉద్దేశం సూచించాలని, దీని కోసం తగిన సమయం ఇచ్చి, సాక్ష్యం తీసుకుంటామని కమిషన్‌ పేర్కొంది. కాగా, తెలుగు పత్రికల్లో ఇచ్చిన నోటిఫికేషన్‌ 3వ పేరాపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దాంట్లో ‘నివేదనలకు ఎటువంటి రాజకీయ సమస్యలు లేదా దాడులు లేకుండా సదరు వ్యక్తులు రూఢీ పరుచుకోవాలి’ అని ఉండడంపై పబ్లిక్‌ పాలసీ నిపుణుడు దొంతి నర్సింహారెడ్డి, కె.బాబూరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలుగు అనువాదంలో లోపాల వల్ల పెడార్థం వచ్చేలా నోటిఫికేషన్‌ వచ్చిందని పేర్కొన్నారు. కాగా, ఫిర్యాదులకు 10 రోజులే అవకాశం ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కనీసం నెల రోజులైనా సమయం ఇవ్వాలని పలువురు సూచిస్తున్నారు.

Updated Date - May 17 , 2024 | 03:19 AM

Advertising
Advertising