ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

D Srinivas: మాజీ మంత్రి డి శ్రీనివాస్ కన్నుమూత

ABN, Publish Date - Jun 29 , 2024 | 07:11 AM

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాస్.. తెల్లవారు జామున 3.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు ధర్మపురి అరవింద్ ట్విటర్ వేదికగా వెల్లడించారు.

D Srinivas

హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాస్.. తెల్లవారు జామున 3.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు ధర్మపురి అరవింద్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. ‘అన్నా.. అంటే నేనున్నా అని.. ఏ ఆపదలో అయినా ఆదుకునే శీనన్న ఇక లేరు. I WILL MISS YOU DADDY నా తండ్రి, నా గురువు అన్నీ మా నాన్నే.! ఎదురొడ్డు, పోరాడు, భయపడకు అని నేర్పింది మా నాన్నే.. ప్రజలను ప్రేమించు, ప్రజల కొరకే జీవించు అని చెప్పింది మా నాన్నే. నాన్నా..! నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు ఎప్పటికీ నా లోనే ఉంటావు’ అని ఎంపీ ధర్మపురి అరవింద్ ట్వీట్ చేశారు.


డి.శ్రీనివాస్ సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్‌లో కొనసాగారు. ఉమ్మడి ఏపీలో మంత్రిగా, ఎంపీగా, పీసీసీ అధ్యక్షుడిగా పని చేశారు.1989, 99, 2004లో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సుదీర్ఘ కాలం పాటు పీసీసీ అధ్యక్షుడిగా పని చేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఆయన బీఆర్ఎస్‌లో చేరారు. కొద్ది రోజుల పాటు ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. ఆపై రాజ్యసభ సభ్యునిగా సైతం కొనసాగారు. ఆ తరువాత అనారోగ్య కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉన్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ధర్మపురి శ్రీనివాస్ 1948 సెప్టెంబర్ 25న జన్మించారు. ఆయనకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సంజయ్ నిజామాబాద్ నగర మేయర్‌గా పని చేశారు. చిన్న కుమారుడు అర్వింద్ బీజేపీ నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు.

Updated Date - Jun 29 , 2024 | 07:18 AM

Advertising
Advertising