ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Harish Rao: రేవంత్.. ప్రజలకు మీరిచ్చే సందేశం ఏంటి..?

ABN, Publish Date - Sep 12 , 2024 | 03:53 PM

బీఆర్ఎస్ యంగ్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో గ్రేటర్ హైదరాబాద్‌లో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. దమ్ముంటే కాస్కో అని ఒకరు అంటే.. తేల్చుకుందాం రా అని ఇంకొకరు అంటున్న పరిస్థితి. ఈ మాటల తూటాలతో ఇద్దరి వ్యక్తుల మధ్య నెలకొన్ని ఈ రచ్చ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీల మధ్య గొడవగా మారిపోయింది...

హైదరాబాద్‌: బీఆర్ఎస్ యంగ్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో గ్రేటర్ హైదరాబాద్‌లో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. దమ్ముంటే కాస్కో అని ఒకరు అంటే.. తేల్చుకుందాం రా అని ఇంకొకరు అంటున్న పరిస్థితి. ఈ మాటల తూటాలతో ఇద్దరి వ్యక్తుల మధ్య నెలకొన్ని ఈ రచ్చ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీల మధ్య గొడవగా మారిపోయింది. అక్కడితో ఆగని ఇరువురూ.. ఒకరిపై ఒకరు రాయలేనంతగా తిట్టిపోసుకున్నారు. కౌశిక్ ఓ బ్రోకర్ అని.. దమ్ముంటే బయటికి రా అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి మరీ సవాల్ చేశారు గాంధీ. కట్టర్ తెలంగాణ బిడ్డనంటూ కౌశిక్ కౌంటరిచ్చారు. ఈ క్రమంలోనే కౌశిక్ ఇంటిపై కార్యకర్తలు, అనుచరులు టమోటాలు, గుడ్లతో దాడికి తెగబడ్డారు. ఈ వ్యవహారంతో ఒక్కసారిగా ఇది కాస్త బర్నింగ్ టాపిక్ అయ్యింది. దీంతో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ ఉద్రిక్తతల మధ్యే గాంధీని పోలీసులు అరెస్ట్ చేశారు. సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు రంగంలోకి దిగారు. కౌశిక్‌ను పరామర్శించేందుకు ఆయన ఇంటికి హరీశ్ బయల్దేరి వెళ్లారు. కౌశిక్ ఇంటికెళ్తూ ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’తో హరీశ్‌రావు ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడారు.


ఏబీఎన్‌తో ఏం మాట్లాడారంటే..

మీ చర్యల వల్ల హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ పోయింది. మా బీఆర్ఎస్ హయాంలో ఎప్పుడైనా ఇలాంటి దాడులు జరిగాయా?. గాంధీపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలి. దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్‌ చేయాలి. దాడిపై సీఎం రేవంత్‌ రెడ్డి ఏం సమాధానం చెబుతారు?. ప్రజలకు రేవంత్‌ రెడ్డి ఇచ్చే సందేశం ఏంటి?. ఖమ్మంలో మాపై దాడి చేస్తే ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదు. తెలంగాణలో లా అండ్‌ ఆర్డర్‌ ఉందా?.. లేదా?. కౌశిక్‌రెడ్డి ఇంటిపైకి దాడికి వస్తున్నారని పోలీసులకు సమాచారం ఇచ్చాం. సమాచారం ఉన్నా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదు?. మీ చర్యల వల్ల హైదరాబాద్‌కు పెట్టుబడులు రావట్లేదుఅని ఏబీఎన్ వేదికగా రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు కన్నెర్రజేశారు.

Updated Date - Sep 12 , 2024 | 03:53 PM

Advertising
Advertising