ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఉండవల్లికి పెన్‌డ్రైవ్‌లో వివరాలు ఇవ్వండి

ABN, Publish Date - Nov 08 , 2024 | 03:24 AM

మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ కేసులో హైకోర్టు గురువారం కీలక ఆదేశాలు ఇచ్చింది. డిపాజిటర్ల (ఇన్వెస్టర్స్‌) వివరాలను ఎలక్ర్టానిక్‌ రూపంలో ప్రెన్‌డ్రైవ్‌ ద్వారా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు అందజేయాలని ఆదేశించింది.

  • డిసెంబరు 15లోగా అందజేయండి

  • తుది విచారణపై జనవరి 3న నిర్ణయం

  • మార్గదర్శి కేసులో హైకోర్టు ఆదేశాలు

హైదరాబాద్‌, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ కేసులో హైకోర్టు గురువారం కీలక ఆదేశాలు ఇచ్చింది. డిపాజిటర్ల (ఇన్వెస్టర్స్‌) వివరాలను ఎలక్ర్టానిక్‌ రూపంలో ప్రెన్‌డ్రైవ్‌ ద్వారా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు అందజేయాలని ఆదేశించింది. ఆర్బీఐ చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి డిపాజిట్లు సేకరించినట్టు నమోదైన కేసుపై ధర్మాసనం విచారణ జరిపింది. పెన్‌డ్రైవ్‌ ద్వారా సమాచారం ఇవ్వాలన్న ఉండవల్లి వినతిని మార్గదర్శి తరఫు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వ్యతిరేకించారు. ఆ వివరాలన్నీ భౌతికంగా 56 వేల పేజీలు పుస్తకాల రూపంలో ఆయన వద్ద ఇప్పటికే ఉన్నాయని తెలిపారు. మళ్లీ ఎందుకని ప్రశ్నించారు. కోర్టుకు ప్రత్యక్షంగా హాజరైన ఉండవల్లి వాదనలు వినిపిస్తూ తన పోరాటానికి 18 ఏళ్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. లూథ్రా మార్గదర్శి కోసం పోరాడుతుంటే తాను ప్రజలు, చట్టం కోసం పోరాడుతున్నానని వ్యాఖ్యానించారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. పెన్‌డ్రైవ్‌లో ఉండవల్లికి డిపాటిజర్ల వివరాలు ఇవ్వాలని ఆదేశించింది.

‘‘మార్గదర్శి కేసులో మాకు (హైకోర్టు)కు సహాయం చేయాలని స్వయంగా సుప్రీంకోర్టే ఉండవల్లికి చెప్పింది. ఆయన సరైన విధంగా మాకు సహకారం ఇవ్వాలంటే డిపాజిటర్ల వివరాలను పెన్‌డ్రైవ్‌ రూపంలో ఇవ్వాలి. దాదాపు 56 వేల పేజీల డిపాజిటర్ల వివరాలను ఎలక్ర్టానిక్‌ రూపంలో అందజేయాలన్న ఉండవల్లి విజ్ఞప్తిని అనుమతిస్తున్నాం. డిసెంబర్‌ 15లోగా ఆయనకు అందజేయాలి. ఈ కేసు కోసం తప్ప మరేరకంగానూ ఉండవల్లి వాటిని ఉపయోగించుకోకూడదు’’ అని స్పష్టం చేసింది. ఈ కేసు లో డిసెంబర్‌ 20లోగా ఉత్తరప్రత్యుత్తరాలు (కౌంటర్‌లు, రిప్లైలు) పూర్తికావాలని ధర్మాసనం ఆదేశించింది. నాలుగు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు సూచించింది. విచారణను వచ్చే ఏడాది జనవరి 3కు వాయిదా వేసింది.

Updated Date - Nov 08 , 2024 | 03:26 AM