DSE EXAMS: జూలై 18 నుంచి డీఎస్సీ పరీక్షలు ..
ABN, Publish Date - Jun 29 , 2024 | 04:42 AM
ప్పుడెప్పుడా అని ఉపాధ్యాయ అభ్యర్థులు ఎదురుచూస్తున్న డీఎస్సీ పరీక్షల తేదీలను ప్రభుత్వం ప్రకటించింది.
13 రోజుల పాటు జిల్లాలు, షిఫ్టుల వారీగా నిర్వహణ
పరీక్షల షెడ్యూల్ ప్రకటించిన విద్యాశాఖ
హైదరాబాద్, జూన్ 28(ఆంధ్రజ్యోతి): ఎప్పుడెప్పుడా అని ఉపాధ్యాయ అభ్యర్థులు ఎదురుచూస్తున్న డీఎస్సీ పరీక్షల తేదీలను ప్రభుత్వం ప్రకటించింది. పరీక్షల షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన శుక్రవారం విడుదల చేశారు. జిల్లాల్లో ఖాళీల ఆధారంగా కొన్ని పరీక్షలను రెండు షిఫ్టుల్లో నిర్వహిస్తున్నారు. పరీక్షల ప్రక్రియ జూలై 18న ప్రారంభమై మొత్తం 13 రోజుల పాటు కొనసాగనుంది. ఆగస్టు-5న హిందీ లాంగ్వేజ్ పండిట్ పరీక్షతో ప్రక్రియ ముగియనుంది.
తేదీ పరీక్ష
18 జూలై స్కూల్ అసిస్టెంట్ (సోషల్ స్టడీస్, ఫిజికల్ సైన్స్)
19 జూలై ఎస్జీటీ
20 జూలై ఎస్జీటీ (స్పెషల్ ఎడ్యుకేషన్)
22 జూలై ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ (మ్యాథమెటిక్స్)
23 జూలై ఎస్జీటీ
24 జూలై స్కూల్ అసిస్టెంట్ (బయాలజికల్ సైన్స్)
25 జూలై స్కూల్ అసిస్టెంట్
(తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్, మరాఠీ)
26 జూలై ల్యాంగ్వేజ్ పండిట్ (తెలుగు) ఎస్జిటీ, పీఈటీ
30 జూలై స్కూల్ అసిస్టెంట్ (సోషల్ స్టడీస్)
31 జూలై స్కూల్ అసిస్టెంట్
(ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, మ్యాథమెటిక్స్)
1 ఆగస్టు ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ (సోషల్ స్టడీస్)
2 ఆగస్టు ల్యాంగ్వేజ్ పండిత్ (తెలుగు, ఉర్దూ,
కన్నడ, మరాఠీ, సంస్కృతం),
స్కూల్ అసిస్టెంట్ (మ్యాథమెటిక్స్, హిందీ)
5 ఆగస్టు స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్),
ల్యాంగ్వేజ్ పండిట్ (హిందీ)
Updated Date - Jun 29 , 2024 | 04:42 AM