Family Concerns: ఒకే పోలీస్ విధానం అమలు చేయాలి
ABN, Publish Date - Oct 26 , 2024 | 03:58 AM
తెలంగాణ స్పెషల్ పోలీ్‌స(టీజీఎస్పీ) బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుళ్లు 24 గంటల పాటు ఉద్యోగాలంటూ ఇళ్లకు రావడం లేదని.. కనీసం మంచి, చెడుల సమయంలో సైతం సెలవులు ఇవ్వడం లేదని వారి కుటుంబ సభ్యులు వాపోయారు.
టీజీఎస్పీ పోలీస్ కుటుంబాల డిమాండ్
సచివాలయ ముట్టడికి యత్నం.. ఉద్రిక్తత
కొండాపూర్, యూసుఫ్‌గూడలో ధర్నా
టీజీఎస్పీ సర్క్యులర్ తాత్కాలికంగా నిలిపివేత
ఖైరతాబాద్/గచ్చిబౌలి/హైదరాబాద్, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ స్పెషల్ పోలీ్‌స(టీజీఎస్పీ) బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుళ్లు 24 గంటల పాటు ఉద్యోగాలంటూ ఇళ్లకు రావడం లేదని.. కనీసం మంచి, చెడుల సమయంలో సైతం సెలవులు ఇవ్వడం లేదని వారి కుటుంబ సభ్యులు వాపోయారు. మహిళలు కన్నీరు పెట్టుకున్నారు. అందరు కానిస్టేబుళ్లలానే తమ వారు కూడా ఎంపికైనా.. వారిని తక్కువగా చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకచోట ఉద్యోగంలో ఉంచకుండా రాష్ట్రమంతా తిప్పుతూ సెలవులు ఇవ్వకపోవడంపై మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల నిరసనలు తెలిపినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో శుక్రవారం సచివాలయ ముట్టడికి యత్నించారు. దీంతో టీజీఎస్పీ సిబ్బంది భార్యలతో పాటు వారి కుటుంబ సభ్యులను మహిళా కానిస్టేబుళ్లు అరెస్టు చేశారు.
కానిస్టేబుళ్ల భార్యలు, పసి పిల్లలతో ఆందోళనకు దిగడం, అరెస్టుల సమయంలో చిన్నపిల్లల ఏడుపులు, మహిళల ఆర్తనాదాలతో సచివాలయం ప్రాంతం అట్టుడికిపోయింది. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో 15 రోజులు డ్యూటీలు వేసేవారని, ప్రస్తుతం 26 రోజులు వెట్టిచాకిరీ చేయిస్తున్నారని కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు ఆరోపించారు. పసి పిల్లలతో ఇంట్లో ఉంటున్నామని, ఇళ్లలో పెద్దలను కూడా చూసుకోవడం లేదని, ఈ ఉద్యోగాల కారణంగా తమ కుటుంబాలు విఛ్చన్నమయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయని వాపోయారు. స్పెషల్ పోలీసులకూ ఇతర పోలీసుల్లాగే ఒకే చోట కనీసం ఐదేళ్లు ఉద్యోగం చేసే అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరారు. ఆందోళనకారులను మహిళా కానిస్టేబుళ్లు అయిష్టంగానే అరెస్టు చేశారు. అరెస్టుల సమయంలో కొందరు పోలీసులను పరుగులు పెట్టించారు.
కొండాపూర్‌లో భారీగా స్తంభించిన ట్రాఫిక్
రాష్ట్రమంతా ఒకే పోలీస్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న స్పెషల్ పోలీసుల కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం సాయంత్రం కొండాపూర్ ప్రధాన రహదారిపై టీజీఎస్పీ 8వ బెటాలియన్ పోలీసుల కుటుంబాల మహిళలు బైఠాయించారు. ‘వియ్ వాంట్ ఏక్ పోలీస్’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఒకే నోటిఫికేషన్, ఒకే పరీక్షతో ఉద్యోగాల్లో చేరుతుండగా బెటాలియన్ పోలీసులను మాత్రం కూలీల మాదిరిగా చూస్తున్నారని ఆరోపించారు. వీరి బైఠాయింపుతో కొండాపూర్‌లో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. అలాగే ధర్నా చేస్తున్న కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు, మహిళలతో సీఐ రాజేశ్ అనుచితంగా ప్రవర్తించాడని, అతన్ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే రంగంలోకి దిగిన కొండాపూర్ బెటాలియన్ కమాండెంట్ మహిళలతో చర్చించారు. డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. శుక్రవారం రాత్రి యూస్‌ఫగూడ చెక్‌పోస్ట్ వద్ద టీజీఎస్పీ మొదటి బెటాలియన్ పోలీసుల కుటుంబ సభ్యులు రోడ్డుపై నిరసన తెలిపారు.
టీజీఎస్పీ సర్క్యులర్ తాత్కాలికంగా నిలిపివేత
టీజీఎస్పీ పునర్విభజనకు సబంధించి జారీ చేసిన సర్క్యులర్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు బెటాలియన్స్ అదనపు డీజీపీ సంజయ్ కుమార్ జైన్ ప్రకటించారు. ఈ నెల 10న జారీ చేసిన సర్క్యులర్‌పై సిబ్బంది కుటుంబ సభ్యులు ఆందోళనలకు దిగారు. ఈ నేపథ్యంలో సర్క్యులర్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జైన్ తెలిపారు. అన్ని బెటాలియన్లతో దర్బార్‌లు నిర్వహించి సిబ్బంది నుంచి అభిప్రాయాలు సేకరించాలని కమాండెంట్లను ఆదేశించారు. సిబ్బంది నుంచి స్వీకరించిన అభ్యంతరాల్ని తన దృష్టికి తీసుకురావాలన్నారు. సిబ్బంది అభ్యంతరాలను పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత తగు నిర్ణయం తీసుకుంటామని జైన్ తెలిపారు. సిబ్బంది తమ సమస్యలు నేరుగా తెలిపేందుకు ్టజటఞఛిౌుఽ్టటౌజూఃజఝ్చజీజూ.ఛిౌఝ, వాట్సాప్ నంబరు 87126 58531 అందుబాటులో ఉంచామన్నారు. బెటాలియన్ సిబ్బంది ఆందోళనలకు కారణమైన సర్క్యులర్‌ను నిలిపివేసిన డీజీపీ జితేందర్, అదనపు డీజీపీ సంజయ్‌కు పోలీస్ అధికారుల సంఘం కృతజ్ఞతలు తెలిపింది.
ఖమ్మం, మంచిర్యాలలో ఆర్‌ఎ్‌ఫసీలు
హైదరాబాద్, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఆధ్వర్యంలో కొత్తగా రెండు రీజనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ(ఆర్‌ఎ్‌ఫసీ)లు ఏర్పాటు చేశారు. ఖమ్మం, మంచిర్యాల జిల్లాల్లో శుక్రవారం కొత్తగా రెండు ఆర్‌ఎ్‌ఫసీ కేంద్రాల్ని అధికారులు ప్రారంభించారు. ఖమ్మంలో భద్రాద్రి, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల పోలీసులకు సేవలందిస్తారు. మంచిర్యాల ఆర్‌ఎ్‌ఫసీ నుంచి ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలతోపాటు రామగుండం కమిషనరేట్ పోలీసులకు సేవలు అందుతాయని ఎఫ్‌ఎస్‌ఎస్ డైరెక్టర్ శిఖాగోయల్ తెలిపారు.
Updated Date - Oct 26 , 2024 | 03:58 AM