Farmers: ఆర్‌ఆర్‌ఆర్ అలైన్‌మెంట్ మార్చాల్సిందే
ABN, Publish Date - Dec 29 , 2024 | 04:01 AM
రీజనల్ రింగ్ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్) అలైన్‌మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తూ అవార్డు విచారణ సమావేశాన్ని భూ నిర్వాసిత రైతులు మూకుమ్మడిగా బహిష్కరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి ఆర్డీవో కార్యాలయంలో భువనగిరి మండలంలోని తుక్కాపురం, ఎర్రంబెల్లి గ్రామాల రైతులకు సంబంధించి అవార్డు విచారణ సమావేశం శనివారం ఏర్పాటు చేశారు.
భువనగిరి ఆర్డీవో కార్యాలయం ఎదుట రైతుల నిరసన
భువనగిరి రూరల్, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : రీజనల్ రింగ్ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్) అలైన్‌మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తూ అవార్డు విచారణ సమావేశాన్ని భూ నిర్వాసిత రైతులు మూకుమ్మడిగా బహిష్కరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి ఆర్డీవో కార్యాలయంలో భువనగిరి మండలంలోని తుక్కాపురం, ఎర్రంబెల్లి గ్రామాల రైతులకు సంబంధించి అవార్డు విచారణ సమావేశం శనివారం ఏర్పాటు చేశారు. రైతులు ఈ సమావేశానికి హాజరు కాకుండా ఆర్డీవో కార్యాలయం బయటే ఉండి నిరసన తెలిపారు. పాత అలైన్‌మెంట్ ప్రకారం భూములను సేకరించాలని డిమాండ్ చేశారు.
అవార్డు విచారణ సమావేశం నిర్వహించేందుకు భువనగిరి ఆర్డీవో ఎం.కృష్ణారెడ్డి ఉదయం 10 గంటలకే కార్యాలయానికి చేరుకోగా, భూ నిర్వాసితులు గంటసేపు ఆందోళన చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. నిర్దేశిత సమయం మధ్యాహ్నం ఒంటిగంట వరకు రైతులు హాజరుకాలేదు. అప్పటి వరకు వేచివున్న ఆర్డీవో కృష్ణారెడ్డి అనంతరం కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీన భువనగిరి మండలం పెంచికల్‌పహాడ్, రాయిగిరి గ్రామాల నిర్వాసితులతో అవార్డు సమావేశం ఉంటుందని, రైతులు పట్టాదారు పాస్ పుస్తకం, బ్యాంకు పాస్ పుస్తకం, తమ భూములు, కట్టడాల వివరాలతో హాజరుకావాలన్నారు.
Updated Date - Dec 29 , 2024 | 04:01 AM