Farmers Protest: వడ్ల పైసల్ వస్తలేవు
ABN, Publish Date - Nov 07 , 2024 | 03:56 AM
ధాన్యం సేకరించి 10 రోజులైనా నేటికి డబ్బులు రాలేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యం సేకరించిన 48 గంటల లోపు రైతు ఖాతాలో డబ్బులు డిపాజిట్ కావాలి.
10 రోజులైనా రైతులకు అందని డబ్బులు
రైతుల నుంచి 900 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించిన అధికారులు
ఘట్‌కేసర్ రూరల్, సిద్దిపేట రూరల్, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): ధాన్యం సేకరించి 10 రోజులైనా నేటికి డబ్బులు రాలేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యం సేకరించిన 48 గంటల లోపు రైతు ఖాతాలో డబ్బులు డిపాజిట్ కావాలి. అయినా అధికారుల నిర్లక్ష్యం వల్ల ధాన్యం సేకరించి 10 రోజులైనా రైతుల ఖాతాల్లో డబ్బులు జమకాలేదు. దీంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. ఘట్‌కేసర్ మండలం ఎదులాబాద్, మాధారం గ్రామాల్లో అధికారులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి నెలరోజులు కాగా, గత నెల 25న ప్రతాప్ సింగారంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.ప్రభుత్వం సేకరించిన ధాన్యానికి డబ్బులు సకాలంలో రాకపోవడంతో రైతన్నలు దళారులను ఆశ్రయిస్తున్నారు. ధాన్యాన్ని తక్కువ ధరకు విక్రయించి నష్టపోతున్నారు. ధాన్యం డబ్బులు త్వరగా ఇవ్వాలని కోరుతున్నారు. కాగా, సాంకేతిక కారణాలతో ఆలస్యమైందని, రెండు రోజుల్లో రైతుల బ్యాంక్‌ఖాతాల్లో డబ్బులు జమచేస్తామని పౌరసరఫరాల శాఖ డీఎం సుగుణబాయి రైతులకు భరోసా ఇచ్చారు.
ప్రభుత్వం కొనక ధాన్యం దళారుల పాలు: హరీశ్
రైతుల ధాన్యాన్ని ప్రభుత్వం కోనుగోలు చేయకపోవడంతో అది దళారుల పాలవుతుందని ఎమ్మెల్యే తన్నీరు హరీ్‌షరావు అన్నారు. సిద్దిపేట రూరల్ మండలం రాఘావాపూర్ ధాన్యం కోనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఆయన రైతులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి కానీ, చేతలు మాత్రం గడప దాటడం లేదన్నారు.
Updated Date - Nov 07 , 2024 | 03:56 AM