ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Medak: కన్నతండ్రే కాలయముడు

ABN, Publish Date - Aug 15 , 2024 | 03:42 AM

కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే ఆ పాప పాలిట కాలయముడయ్యాడు! ఎదుగుతున్న కుమార్తెకు పెళ్లి చేయగలనో లేదో అని అతిగా ఆలోచించి.. ఆమె ప్రాణాలు తీశాడు!!

  • పెద్దయితే పెళ్లి చేయలేనని.. తొమ్మిదేళ్ల కూతుర్ని చంపిన తండ్రి

  • కూల్‌డ్రింక్‌లో పురుగు మందు కలిపి హత్య.. ఆలస్యంగా వెలుగులోకి

వెల్దుర్తి, ఆగస్టు 14: కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే ఆ పాప పాలిట కాలయముడయ్యాడు! ఎదుగుతున్న కుమార్తెకు పెళ్లి చేయగలనో లేదో అని అతిగా ఆలోచించి.. ఆమె ప్రాణాలు తీశాడు!! మెదక్‌జిల్లా వెల్దుర్తి పంచాయతీ పరిధిలోని శేరీల గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శేరీల గ్రామానికి చెందిన ఇక్కిరి సౌందర్య, శ్రీశైలం దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె నిఖిత (9) ఉన్నారు. వారి కుటుంబం చాలాకాలంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతోంది.


ఈ క్రమంలో.. ఎప్పుడో చేయాల్సిన కూతురి పెళ్లి గురించి శ్రీశైలం అతిగా ఆలోచించడం ప్రారంభించాడు. ఆమెను చంపేయడమే ఈ సమస్యకు పరిష్కారంగా భావించాడు. మే 31న కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలిపి తీసుకొచ్చి ఆ పాపతో తాగించాడు. తీవ్ర అస్వస్థతకు గురైన బాలికను కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని నిలోఫర్‌ ఆస్పత్రిలో చేర్చారు. నాలుగురోజులపాటు మృత్యువుతో పోరాడిన ఆ పాప.. జూన్‌ 3న చనిపోయింది. నిఖిత తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. బుధవారం శ్రీశైలాన్ని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరచగా.. కోర్టు అతడికి రిమాండ్‌ విధించింది.

Updated Date - Aug 15 , 2024 | 06:57 AM

Advertising
Advertising
<