ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Miryalaguda: అప్పుల బాధతో ఆటో డ్రైవర్‌ ఆత్మహత్య..

ABN, Publish Date - Jul 08 , 2024 | 05:17 AM

ఆర్థిక ఇబ్బందులతో పాటు కుటుంబ పోషణ భారంగా మారి మిర్యాలగూడలో ఆదివారం ఓ ఆటోడ్రైవర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు.

మిర్యాలగూడ అర్బన్‌, జూలై 7: ఆర్థిక ఇబ్బందులతో పాటు కుటుంబ పోషణ భారంగా మారి మిర్యాలగూడలో ఆదివారం ఓ ఆటోడ్రైవర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన నానాపురం నాగేంద్రబాబు (35) 15 సంవత్సరాలుగా ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆటో గిరాకీ రోజురోజుకూ తగ్గిపోవడంతో కొద్ది రోజులుగా ఆటోకు తెచ్చిన ఫైనాన్స్‌ కట్టలేదు. అంతేకాక ఆటో నడవకపోవడంతో కుటుంబపోషణ కూడా భారంగా మారింది.


దీంతో తెలిసిన వారి వద్ద అప్పులు తీసుకున్నాడు. ఆటో ఫైనాన్స్‌ కట్టపోవడం, తెచ్చిన అప్పులు మొత్తం రూ. 3లక్షలు ఎలా చెల్లించాలో తెలియక మనోవేదనకు గురయ్యాడు. ఆదివారం ఉదయం మిర్యాలగూడలో గుర్తు తెలియని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.

Updated Date - Jul 08 , 2024 | 05:17 AM

Advertising
Advertising
<