CM Relief Fund: సీఎంఆర్‌ఎఫ్‌కు ఒక్క రోజే రూ.9.50 కోట్లు

ABN, Publish Date - Sep 07 , 2024 | 04:27 AM

సీఎంఆర్‌ఎ్‌ఫకు విరాళాల వెల్లువ కొనసాగుతోంది. శుక్రవారం ఒక్కరోజే రూ.9.50కోట్లు సమకూరా యి.

CM Relief Fund: సీఎంఆర్‌ఎఫ్‌కు ఒక్క రోజే రూ.9.50 కోట్లు

హైదరాబాద్‌, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): సీఎంఆర్‌ఎ్‌ఫకు విరాళాల వెల్లువ కొనసాగుతోంది. శుక్రవారం ఒక్కరోజే రూ.9.50కోట్లు సమకూరా యి. జీఎంఆర్‌ గ్రూపు రూ.2.50కోట్లు, కెమిలాయిడ్స్‌ కంపెనీ రూ.కోటి, శ్రీచైతన్య విద్యాసంస్థలు రూ.కోటి, విక్రోఫార్మా రూ.కోటి, అపోలో హాస్పిటల్స్‌ రూ.కోటి, ఆర్‌వీఆర్‌ ప్రాజెక్ట్స్‌ రూ.కోటి చొప్పున విరాళాలను ప్రకటించాయి. తెలంగాణ ఫారెస్ట్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పొదెం వీరయ్య కార్పొరేషన్‌ తరపున రూ.2కోట్ల చెక్కును సీఎంకు అందించారు. ఎంపీ చామల కిరణ్‌కుమార్‌ ఒక నెల వేతనాన్ని విరాళంగా ఇచ్చారు.


  • కాటూరి వైద్య కళాశాల విరాళం రూ.10కోట్లు

గుంటూరు జిల్లాలోని కాటూరి వైద్య కళాశాల, ఆసుపత్రి వ్యవస్థాపకులు కాటూరి సుబ్బారావు శుక్రవారం సీఎం చంద్రబాబును కలిశారు. వరద బాధితుల సహాయార్థం సీఎంఆర్‌ఎ్‌ఫకు రూ.10 కోట్ల విరాళాన్ని చెక్కు రూపంలో అందజేశారు.

Updated Date - Sep 07 , 2024 | 04:27 AM

Advertising
Advertising