ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Krishna Basin: సాగర్‌ గేట్లన్నీ ఓపెన్‌..

ABN, Publish Date - Aug 09 , 2024 | 03:41 AM

కృష్ణా బేసిన్‌లోని అన్ని ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. ప్రాజెక్టులన్నీ నిండుగా ఉండటంతో వచ్చిన వరదను వచ్చినట్లే దిగువకు వదిలేస్తున్నారు.

  • 26గేట్లు ఎత్తి 4లక్షల క్యూసెక్కుల విడుదల

  • ప్రస్తుతం 3.74 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

  • కడలి దిశగా గోదావరి, కృష్ణమ్మ పరుగులు

  • సముద్రంలో కలిసిన 1,756 టీఎంసీలు

హైదరాబాద్‌/నాగార్జునసాగర్‌, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): కృష్ణా బేసిన్‌లోని అన్ని ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. ప్రాజెక్టులన్నీ నిండుగా ఉండటంతో వచ్చిన వరదను వచ్చినట్లే దిగువకు వదిలేస్తున్నారు. శుక్రవారం నాగార్జునసాగర్‌కు వరద పోటెత్తింది. ప్రాజెక్టులోకి 3,74,304 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా.. మొత్తం 26 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి, కుడి, ఎడమ కాల్వలు, అన్ని మార్గాల ద్వారా జలాశయం నుంచి మొత్తం 4,02,098 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతోంది. ఎగువన ఉన్న శ్రీశైలానికి 3,54,761 క్యూసెక్కుల వరద చేరుతోంది.


ఇటు ఎగువ గోదావరిలో మహారాష్ట్రలోని జైక్వాడి నుంచి శ్రీపాద ఎల్లంపల్లి దాకా ప్రాజెక్టులకు నాలుగు అంకెల వరదే కొనసాగుతోంది. 102.732 టీఎంసీల సామర్థ్యమున్న జైక్వాడిలో ప్రస్తుతం 45.45 టీఎంసీలే ఉండగా.. ప్రస్తుతం ప్రాజెక్టుకు 8,044 క్యూసెక్కుల వరద వస్తోంది. మంజీరా నదిపై ఉన్న సింగూరుకు 1,445 క్యూసెక్కులు, నిజాంసాగర్‌కు 400 క్యూసెక్కులు, ప్రధాన గోదావరిపై ఉన్న శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ)కు 6,150 క్యూసెక్కులు, కడెం ప్రాజెక్టుకు 6,150 క్యూసెక్కులు, ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 8,816 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది.


ఇక దిగువ గోదావరిలో ఉన్న మేడిగడ్డ (ప్రాణహిత)కు 2,99,850 క్యూసెక్కులు, సమ్మక్కసాగర్‌కు 5,86,400 క్యూసెక్కులు, సీతమ్మసాగర్‌ (దుమ్ముగూడెం)కు 7,20,426 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. వచ్చిన వరద వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు. ఎగువ గోదావరిలో వరద లేక జలాశయాలన్నీ అంతంత మాత్రమే నిల్వలు కలిగి ఉండగా.. దిగువ గోదావరిలో భారీ వరదలు రావడంతో ఆ నీటిని ఒడిసి పట్టే అవకాశాలు లేక భారీగా సముద్రంలో కలసిపోతోంది.


జూన్‌ 1 వాటర్‌ ఇయర్‌ ప్రారంభమైన నాటి నుంచి శుక్రవారం దాకా 1,741 టీఎంసీల వరద సముద్రంలో కలిసింది. గోదావరిలో చివరిదైన ధవళేశ్వరం బ్యారేజీకి శుక్రవారం 5,68,946 క్యూసెక్కులు రాగా.. 5,67,131 క్యూసెక్కులు సముద్రంలోకి వదిలేశారు. ఇక కృష్ణా బేసిన్‌లో ఎగువన ఆల్మట్టి, ఉజ్జయిని నుంచి చివరిలో ఉన్న ప్రకాశం బ్యారేజీ దాకా అన్నీ నిండు కుండలా ఉన్నాయి. దాంతో ప్రాజెక్టుల్లోకి వచ్చిన వరదను వచ్చినట్లే దిగువకు వదిలేయాల్సిన పరిస్థితి. కృష్ణాలో ఇప్పటిదాకా 15.04 టీఎంసీలు సముద్రంలో కలిశాయి. శుక్రవారం ప్రకాశం బ్యారేజీకి 3.05లక్షల క్యూసెక్కుల వరద రాగా.. వచ్చింది వచ్చినట్లే వదిలేశారు.


వివిధ ప్రాజెక్టుల పరిస్థితి.. (నిల్వలు-టీఎంసీల్లో, ఫ్లోలు-క్యూసెక్కుల్లో)

ప్రాజెక్టు పూర్తి నిల్వ ప్రస్తుత నిల్వ ఇన్‌ఫ్లో ఔట్‌ఫ్లో

ఆల్మట్టి 129.72 105.89 2,61,000 2,00,000

నారాయణపూర్‌ 37.64 31.56 2,00,000 2,00,490

తుంగభద్ర 105.79 103.58 59,013 50,912

జూరాల 9.66 8.49 3,00,000 2,89,169

శ్రీశైలం 215.81 202.51 3,54,761 4,02,098

నాగార్జునసాగర్‌ 312.05 298.59 3,74,304 4,02,098

పులిచింతల 45.77 35.42 2,46,320 2,46,519

సింగూరు 29.91 14.80 1,445 391

శ్రీరాంసాగర్‌ 80.5 47.25 6,150 3,883

కడెం 7.6 6.89 1,537 969

ఎల్లంపల్లి 20.18 13.89 8,816 6,725

Updated Date - Aug 09 , 2024 | 03:41 AM

Advertising
Advertising
<