ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ts News: 8 రోజుల ఏసీబీ కస్టడీకి హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ

ABN, Publish Date - Jan 31 , 2024 | 08:17 AM

హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కస్టడీకి నాంపల్లి కోర్టు అంగీకరించింది. శివ బాలకృష్ణ ఆస్తులపై దర్యాప్తు జరిపేందుకు 10 రోజుల కస్టడీ ఇవ్వాలని ఏసీబీ అధికారుల కోరారు. 8 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది.

హైదరాబాద్: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ (Shiva BalaKrishna) కస్టడీకి నాంపల్లి కోర్టు అంగీకరించింది. శివ బాలకృష్ణ ఆస్తులపై దర్యాప్తు జరిపేందుకు 10 రోజుల కస్టడీ ఇవ్వాలని ఏసీబీ అధికారుల కోరారు. 8 రోజులపాటు కస్టడీకి కోర్టు అనుమతించింది. శివ బాలకృష్ణ బినామీల విచారణ, ఆస్తులపై దర్యాప్తు చేయనుంది. ఇప్పటికే పలువురికి నోటీసులు జారీచేసింది. హెచ్ఎండీఏతోపాటు రేరా, మెట్రోలో జరిగిన అక్రమాలపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తారు. హైరేస్ బిల్డింగ్ అనుమల్లో అక్రమాలపై విచారిస్తారు. వివాదాస్పద భూముల్లో అనుమతుల ఇచ్చారని ఏసీబీకి ఫిర్యాదులు వచ్చాయి. పుప్పాలగూడ 447 సర్వే నంబర్‌లో అనుమతులపై సూర్య ప్రకాశ్ అనే వ్యక్తి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. శివ బాలకృష్ణను కస్టడీకి తీసుకొని విచారిస్తే మరిన్ని ఆస్తులు వివరాలు బయటపడే అవకాశం ఉంది. శివ బాలకృష్ణకు చెందిన బ్యాంక్ లాకర్లను ఈ రోజు అధికారులు తెరుస్తారు.

శివ బాలకృష్ణ మెట్రో రైల్ ప్లానింగ్ అధికారి, రెరా కార్యదర్శిగా ఉన్నారు. గతంలో హెచ్ఎండీఏ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ సమయంలో రూ.100 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టారని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. వారం రోజుల క్రితం శివ బాలకృష్ణ ఇళ్లు, కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో రూ.40 లక్షల నగదు, 2 కిలోల బంగారం స్వాధీనం, కాస్ట్లీ వాచీలు చేసుకున్నారు. తనిఖీ చేపట్టిన కొద్ది శివ బాలకృష్ణ ఆస్తుల వివరాలు బయటపడుతున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 31 , 2024 | 08:17 AM

Advertising
Advertising