ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: పిల్లల కోసం బెంగ!

ABN, Publish Date - Jun 01 , 2024 | 04:07 AM

నవమాసాలు మోసి కనకున్నా.. ఆ పిల్లలను ఆ తల్లులు ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్నారు. వారే లోకంగా బతుకుతున్నారు. అలాంటిది.. తమ వద్ద నుంచి పిల్లలను దూరంచేస్తే ఆ తల్లిండ్రులు బాధపడరా? పది నిమిషాలు కనిపించకపోతేనే తల్లడిల్లిపోయే స్థితిలో మూడు రోజులుగా పిల్లలను చూడకుండా ఉన్న ఆ తల్లిదండ్రుల ఆవేదన ఏ స్థాయిలో ఉంటుంది?

  • 3 రోజులుగా శిశు విహార్‌ వద్దే పెంపుడు తల్లిదండ్రుల నిరీక్షణ

  • అన్నం తింటున్నారో లేదో.. ఆరోగ్యం ఎలా ఉందో అంటూ కన్నీళ్లు

  • ఒక్కసారి చూస్తాం.. లోపలికి అనుమతించండి అని వేడుకోలు

  • లోపల ఉన్న 14 మంది చిన్నారుల్లో ఇద్దరు పిల్లలకు జ్వరం?

  • ‘కారా’ రూల్స్‌ సడలించాలంటున్న స్వచ్ఛంద సంస్థలు

  • విచారణ ముగిసేదాకా పిల్లలను చూసే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి

  • సొంత తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చి.. పిల్లలను అప్పగించండి:మంత్రి సీతక్క

హైదరాబాద్‌ సిటీ/యూసు్‌ఫగూడ, పంజాగుట్ట, మే 31 (ఆంధ్రజ్యోతి): నవమాసాలు మోసి కనకున్నా.. ఆ పిల్లలను ఆ తల్లులు ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్నారు. వారే లోకంగా బతుకుతున్నారు. అలాంటిది.. తమ వద్ద నుంచి పిల్లలను దూరంచేస్తే ఆ తల్లిండ్రులు బాధపడరా? పది నిమిషాలు కనిపించకపోతేనే తల్లడిల్లిపోయే స్థితిలో మూడు రోజులుగా పిల్లలను చూడకుండా ఉన్న ఆ తల్లిదండ్రుల ఆవేదన ఏ స్థాయిలో ఉంటుంది? ఇదంతా యూసు్‌ఫగూడలోని శిశువిహార్‌ పరిసరాల్లో కళ్లకు కడుతోంది. నిజమే.. సెంట్రల్‌ ఆడాప్షన్‌ రిసోర్స్‌ అథారిటీ (కారా) నిబంధనలకు విరుద్ధంగా దత్తత తీసుకొని తప్పే చేశాం అంటూ లెంపలేసుకొంటూనే.. తమ బిడ్డల్ని ఒక్కసారి చూపించండి అంటూ అధికారులను తల్లిదండ్రులు ప్రాధేయపడుతున్నారు.


శిశువుల విక్రయానికి సంబంధించి అంతర్రాష్ట్రముఠా గుట్టురట్టవ్వడంతో మూడు రోజుల క్రితం వివిధ చోట్ల నుంచి 14మంది శిశువులు, చిన్నారులను పోలీసులు స్వాధీనం చేసుకొని యూసు్‌ఫగూడలోని శిశువిహార్‌లో అప్పగించారు. వీరిలో 12 మంది నెలల వయసు పిల్లలుండగా ఇద్దరు మూడేళ్లలోపు ఉన్నారు. శిశు విహార్‌లో ఉన్న తమ చిన్నారులు ఎలా ఉన్నారో? అన్నం తింటున్నారో లేదో? ఆరోగ్యం ఎలా ఉందో? అనే ఆలోచనతో పెంపుడు తల్లిదండ్రులు ఆకలిదప్పులూ పట్టకుండా బెంగటిల్లుతున్నారు. పిల్లలు వైద్యులపర్యవేక్షణలో ఉన్నా కొందరు జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.


దత్తత ప్రక్రియ ఆలస్యం.. సంక్లిష్టం!

పొరుగు రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ, ఏపీలో పిల్లల దత్తత ప్రక్రియలో తీవ్ర ఆలస్యం జరుగుతుంది. ఈ కారణంగానే పిల్లలు లేని దంపతులు నిబంధనలకు విరుద్ధంగా శిశువులను దత్తత తీసుకుంటున్నట్లు సమాచారం. మహారాష్ట్ర, కర్ణాటకలో దరఖాస్తు చేసుకున్న ఆరు నుంచి ఏడాదిలోపు పిల్లల దత్తత ప్రక్రియ పూర్తవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం రెండు, మూడేళ్లు పడుతోందని స్వచ్ఛంద సంస్థల బాధ్యులు చెబుతున్నారు. పిల్లలను దత్తత తీసుకోవాలంటే తొలుత.. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కారా వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత పాన్‌కార్డు నంబర్‌, రెసిడెన్స్‌ ఫ్రూఫ్‌, ఆదాయ ధ్రువీకరణ పత్రం, వివాహ నమోదు పత్రం, దంపతుల బర్త్‌, హెల్త్‌ సర్టిఫికెట్లు సమర్పించాలి.


భార్యాభర్తల పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలతోపాటు ఇద్దరు కలిసి దిగిన పెళ్లి ఫొటోను కూడా దరఖాస్తుతో సమర్పించాలి. అలాగే రూ.6వేల డీడీ అప్లికేషన్‌ ఫారంతోపాటు రూ.40 వేలు దత్తత తీసుకునే సమయంలో సంబంధిత అనాథాశ్రమానికి లేకుంటే ప్రభుత్వ సంస్థలకు చెల్లించాలి. దరఖాస్తు చేసుకున్న అనంతరం రెండు నుంచి మూడేళ్లకు పిల్లలను దంపతులకు అప్పగిస్తారు. అప్పగించిన తర్వాత కూడా స్ర్తీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు పిల్లలను పర్యవేక్షించాలి. దత్తత తీసుకున్న జంటల ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? వారు పిల్లాడిని బాగా చూసుకుంటున్నారా? లేదా? అనేవి ప్రతి ఆరు నెలలకోసారి పరిశీలించాలి. ఈ సందర్భంగా సదరు తల్లిదండ్రుల నుంచి ఆరునెలలకోసారి రూ.2వేల చొప్పున తీసుకుంటారు.

Updated Date - Jun 01 , 2024 | 04:07 AM

Advertising
Advertising