ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: రాష్ట్ర సచివాలయంతో పాటు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లోనూ ఇకపై సీఎం సమీక్షలు

ABN, Publish Date - Jun 23 , 2024 | 03:29 AM

బంజారాహిల్స్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగానే ఇకపై కీలక సమీక్షలను కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ వేదికగానే నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు.

హైదరాబాద్‌, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి) : బంజారాహిల్స్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగానే ఇకపై కీలక సమీక్షలను కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ వేదికగానే నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే వేదికగా పలు మార్లు ముఖ్యమంత్రి సమీక్షలు నిర్వహించారు. సీఎం నివాసంతోపాటు మంత్రుల నివాస సముదాయానికి దగ్గర్లో ఉండడం, సీఎం రాకపోకల సమయంలో సాధారణ ప్రజలకు ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా ఉంటుందన్న ఉద్దేశంతోనే ఇక్కడ సమీక్షల నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తున్నారు.


ఈ మేరకు సచివాలయంతోపాటు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను సమీక్షలకు విరివిగా ఉపయోగించాలని సీఎం రేవంత్‌ రెడ్డి నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో ఇప్పటికీ అసంపూర్తిగా ఉన్న పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి, అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ భవనాన్ని హైదరాబాద్‌ సీపీ, టీజీ న్యాబ్‌, సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో మాత్రమే వినియోగించుకుంటున్నాయి. త్వరలోనే మిగతా కీలక విభాగాలు ఇక్కడి నుంచి పని చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. బోనాలు, గణేష్‌ ఉత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను పూర్తి స్థాయిలో అప్‌డేట్‌ చేసి ఇక్కడి నుంచే పరిస్థితిని సమీక్షించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.

Updated Date - Jun 23 , 2024 | 03:29 AM

Advertising
Advertising