ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Singareni: సింగరేణికి బొగ్గు కష్టాలు!

ABN, Publish Date - Oct 09 , 2024 | 04:23 AM

బొగ్గు ఉత్పత్తిలో 135 ఏళ్ల చరిత్ర కలిగి.. తెలంగాణ కొంగుబంగారంగా వెలుగొందుతున్న సింగరేణి సంస్థకు భవిష్యత్తులో బొగ్గు దొరకడమే కష్టంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఏటేటా తరిగిపోతున్న బొగ్గు నిల్వలు.. పెద్ద సంఖ్యలో మూతపడనున్న బ్లాకులు

  • రానున్న ఏడేళ్లలో 19 బ్లాకుల మూత

  • ప్రస్తుతం 42 గనులోనే మైనింగ్‌

  • 2042-43 నాటికి 19 గనులకే పరిమితం

  • వేలంలో పాల్గొంటే గనులు దక్కే చాన్స్‌

  • వేలానికి సుముఖత చూపని ప్రభుత్వం

హైద రాబాద్‌, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): బొగ్గు ఉత్పత్తిలో 135 ఏళ్ల చరిత్ర కలిగి.. తెలంగాణ కొంగుబంగారంగా వెలుగొందుతున్న సింగరేణి సంస్థకు భవిష్యత్తులో బొగ్గు దొరకడమే కష్టంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బొగ్గు నిల్వలు శరవేగంగా కరిగిపోతుండడం ఇందుకు ఒక కారణమైతే, గోదావరి-ప్రాణహిత లోయలో 600 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న బొగ్గు నిల్వలపై గుత్తాధిపత్యం రద్దు కావడం మరో కారణం. దీనికితోడు కళ్లముందే బొగ్గు నిల్వలు ఉన్నా వేలంలో పాల్గొననందున.. తవ్వుకోలేని నిస్సహాయత ఇంకో కారణం. ప్రస్తుతం 22 భూగర్భ గనులు (యూజీలు), 20 ఓపెన్‌కాస్టులు(ఓసీలు) కలుపుకొని 42 గనుల్లో సింగరేణి మైనింగ్‌ చేస్తోంది.


అయితే నిల్వలు తగ్గినందున 2024-25లో నాలుగు గ నులను, 2025-26లో మరో నాలుగు గనులను మూసివేయనుంది. అనంతరం 2027-28 నుంచి 2031-32 మధ్యకాలంలో 11 గనులు మూతపడతాయని లెక్క లు చెబుతున్నాయి. ఆ తరువాత కూడా మరో నాలు గు గనులు మూతపడి 2042-43 నాటికి సింగరేణి 19 గనులకే పరిమితం కానుంది. వీటిలో 9 యూజీలు, 10 ఓసీలు ఉండనున్నాయి. ప్రస్తుతం 72.01 మిలియన్‌ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తున్న సింగరేణి సంస్థ 2042-43కు చేరేసరికి 39.03 మిలియన్‌ టన్నులకు పడిపోనుంది. ఈ నేపథ్యంలో సింగరేణి భవితవ్యానికి దారిచూపే బాధ్యతను సింగరేణి కార్మికులకే వదిలేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఈ నెల 11న ప్రతి బొగ్గుబావి వద్ద సమావేశం ఏర్పాటు చేసి.. వాస్తవాలను కార్మికులకు వివరించి, భవిష్యత్తు కార్యాచరణ కు పునాది వేసుకోనుంది.


  • కేంద్రం కరుణిస్తేనే..

బొగ్గు కొరతను సింగరేణి అధిగమించాలంటే గనుల కోసం కేంద్రం ముందు దేబిరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే బొగ్గు బావులు పొందాలంటే ప్రభుత్వ రంగసంస్థలు కూడా ప్రైవే టు సంస్థలతోపాటే బిడ్డింగ్‌లో పాల్గొనాలంటూ కేంద్ర ప్రభుత్వం మైన్స్‌ అండ్‌ మినరల్‌ (డెవల్‌పమెంట్‌ అండ్‌ రెగ్యులేషన్‌) యాక్ట్‌-2016 ప్రకారం వేలం పాటలు నిర్వహిస్తోంది. దేశంలో బొగ్గు గనుల వేలం 2020 నుంచి శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికి పదిసార్లు వేలం జరిగింది. ఇందులో బొగ్గు నిల్వలు ఉన్నట్లు సింగరేణి స్వయంగా అన్వేషించిన బ్లాకులూ ఉన్నాయి.


పైగా ఇప్పటికే సింగరేణి మైనింగ్‌ చేస్తున్న బ్లాకులకు ముందు, వెనుకా ఉన్న బ్లాకులను కళ్లముందే వేలం వేసి ఎగరేసుకుపోతున్నా.. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకపోవడంతో వేలంలో ఆ సంస్థ పాల్గొనలేని పరిస్థి తి నెలకొంది. అయితే ఎంఎండీఆర్‌ యాక్ట్‌-2016 లోని సెక్షన్‌ 17(2)ఏ ప్రకారం దక్కిన ప్రత్యేక అధికారాలతో బొగ్గు బ్లాకులను రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థకు కేటాయించే విచక్షణ కేంద్రానికి ఉంది. ఇదే సెక్షన్‌ కింద సింగరేణికి బ్లాకులు కేటాయించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. కేంద్రం మాత్రం బ్లాకులు కా వాలంటే వేలంలో పాల్గొనాల్సిందేనని స్పష్టంచేస్తోంది. సింగరేణి అధికార యంత్రాంగం కూడా వేలంలో పాల్గొని బ్లాకులను దక్కించుకుంటేనే మేలని ప్రభుత్వానికి సూచిస్తోంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సానుకూలత చూపడం లేదు.


  • 19కి తగ్గనున్న గనులు..

కోల్‌బెల్ట్‌లో ప్రస్తుతం 42 బొగ్గు బ్లాకుల్లో సింగరేణి మైనింగ్‌ చేస్తోంది. వీటిలో భూగర్భ గనులు 22 ఉండగా, ఓపెన్‌కాస్టులు 20 ఉన్నాయి. 2025- 26లో యూజీలు 18కి, ఓసీలు 19కి చేరనున్నాయి. అదే 2026-27 కల్లా యూజీలు 17కు, ఓసీలు 21కి(యూజీలను ఓసీలుగా మార్చే క్రమంలో)చేరనున్నాయి. 2027-28లో యూజీలు 18కి చేరి, ఓసీలు 21 దాకా ఉండనున్నాయి. రానున్న ఏడేళ్లలో 19 గనులు మూతపడతాయని గణాంకాలు చెబుతున్నాయి. భూగర్భ గనులన్నీ నష్టాల్లో ఉండగా.. ఓపెన్‌కాస్టులతో ఆ నష్టాలను భర్తీ చేస్తున్నారు. సింగరేణి ఉత్పత్తి చేసే బొగ్గులో 80ు వాటా ఓపెన్‌కాస్టులది కాగా, 20ు మాత్రమే భూగర్భ గనులది.


భూగర్భ గనుల్లో బొగ్గు ఉత్పత్తి చేసేందుకు ఒక టన్నుకు రూ.9 వేలకు పైగా ఖర్చవుతుండగా.. ఆ బొగ్గును అమ్మితే సింగరేణికి దక్కేది టన్నుకు రూ.4 వేలే. ఇక అదే ఓపెన్‌కాస్టుల్లో తీసే బొగ్గు టన్నుకు రూ.1700 లోపే ఖర్చవుతుండగా.. విక్రయించడం ద్వారా టన్ను కు రూ.4 వేలు వస్తున్నాయి. ప్రస్తుతం 72.01 మిలియన్‌ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తుండగా, 2042- 43 నాటికి అది 39.03 మిలియన్‌ టన్నులకు తగ్గనుంది. ఇందులో యూజీల వాటా 3.63 మిలియన్‌ టన్నులు కాగా, ఓసీల వాటా 35.40 మిలియన్‌ టన్నులు ఉండనుంది. ఇదిలా ఉం డగా.. 2014 నాటికి సింగరేణిలో కార్మికుల సంఖ్య 60 వేలకు పైగా ఉండగా, ప్రస్తుతం 40,994కు చేరింది. 2042-43 నాటికి ఈ సంఖ్య 35,663కు తగ్గనుంది.

మూతపడే గనులు ఇవీ..

  • 2024-25లో జేకే-5 ఓసీ, ఆర్‌జీ ఓసీ-1 ఎక్స్‌పెన్షన్‌, ఎస్‌ఆర్‌పీ-1 ఇంక్లెయిన్‌, ఆర్‌కేపీ ఓసీపీ-ఒకటో దశ.

  • 2025-26లో కేటీకే-6అండ్‌6ఏ ఇంక్లెయిన్‌, ఆర్‌కే-5 ఇంక్లెయిన్‌, ఆర్‌కే-6 ఇంక్లెయిన్‌, ఆర్‌కే ఎన్‌టీ.

  • 2027-28 నుంచి 2031-32 మధ్యకాలంలో కేకే-5 ఇంక్లెయిన్‌, కిష్టారం ఓసీ, కే హెచ్‌జీ ఓసీ, ఆర్‌కే-7 ఇంక్లెయిన్‌, పీకే ఓసీ, ఆర్‌జీ ఓసీ-3 ఎక్స్‌టెన్షన్‌, జీడీ కే-11 ఇంక్లెయిన్‌, ఐకే1ఏ ఇంక్లెయిన్‌, కేవోసీ-2, వాకిపల్లిమైన్‌, పీవీకే 5 ఇంక్లెయిన్‌.

Updated Date - Oct 09 , 2024 | 04:23 AM