ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gaddar: తూప్రాన్‌ లిఫ్టు ఇరిగేషన్‌కు గద్దర్‌ పేరు

ABN, Publish Date - Oct 12 , 2024 | 04:03 AM

దివంగత ఉద్యమనేత, ప్రజా యుద్ధనౌక గద్దర్‌కు మరో గౌరవం దక్కింది. మెదక్‌ జిల్లా తూప్రాన్‌ పట్టణ శివారులోని హల్దీవాగు లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు... ‘గద్దర్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పంప్‌హౌ్‌స’గా నామకరణం చేశారు.

తూప్రాన్‌, అక్టోబరు 11: దివంగత ఉద్యమనేత, ప్రజా యుద్ధనౌక గద్దర్‌కు మరో గౌరవం దక్కింది. మెదక్‌ జిల్లా తూప్రాన్‌ పట్టణ శివారులోని హల్దీవాగు లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు... ‘గద్దర్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పంప్‌హౌ్‌స’గా నామకరణం చేశారు. ఆయన స్వగ్రామమైన తూప్రాన్‌లోని పెద్ద చెరువు... 1986 నుంచి 2016 వరకు దాదాపు మూడు దశాబ్దాల పాటు నిండలేదు. ‘మై విలేజ్‌ ఆఫ్టర్‌ 60 ఇయర్స్‌’ పుస్తక రచన కోసం గతంలో ఆయన ఇక్కడ పర్యటించారు. ఆ సమయంలో పెద్దచెరువు నిండటం లేదని పలువురు గద్దర్‌ దృష్టికి తీసుకువచ్చారు.


దీంతో ఆయన ప్రత్యేక చొరవ తీసుకుని హల్దీవాగు నుంచి లిఫ్ట్‌ ఏర్పాటు కోసం రూ. 3.61 కోట్లు మంజూరు చేయించారు. అయితే, పెద్దచెరువు పంప్‌హౌ్‌సకు గద్దర్‌ పేరు పెట్టాలని తూప్రాన్‌ మున్సిపాలిటీలో చైర్‌పర్సన్‌ మామిండ్ల జ్యోతికృష్ణ ఆధ్వర్యంలో ఇటీవల తీర్మానం చేశారు. ఈ మేరకు శుక్రవారం దానికి ‘గద్దర్‌ లిప్టు ఇరిగేషన్‌ పంప్‌హౌ్‌స’గా నామకరణం చేశారు.

Updated Date - Oct 12 , 2024 | 04:03 AM