Adani Group: తెలంగాణ ప్రభుత్వానికి గౌతమ్ అదానీ రూ. 100 కోట్ల విరాళం.. వీటికోసమేనా..
ABN, Publish Date - Oct 18 , 2024 | 08:13 PM
అదానీ ఫౌండేషన్ తెలంగాణ ప్రభుత్వానికి రూ. 100 కోట్లు విరాళంగా అందజేసింది. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ ఫౌండేషన్ ప్రతినిధి బృందం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఈ మేరకు చెక్కును అందజేశారు.
తెలంగాణలో 'యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ'కి అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ భారీ విరాళం ప్రకటించారు. ఈ నేపథ్యంలో అదానీ ఫౌండేషన్ తరఫున శుక్రవారం తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డిని కలిసి 'యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ'కి రూ.100 కోట్ల చెక్కును విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా అదానీ పోర్ట్స్ ఎండీ కరణ్ అదానీ తదితరులు సహా పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విషయాన్ని తెలంగాణ సీఎం కార్యాలయం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ప్రకటించింది.
భవిష్యత్తులో కూడా..
సమావేశం అనంతరం గౌతమ్ అదానీ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ చొరవతో రేవంత్ రెడ్డిని కలిసినట్లు తెలిపారు. ఈ క్రమంలో యువత భవిష్యత్తును రూపొందించడం మాత్రమే కాదు.. ప్రకాశవంతమైన, సంపన్నమైన భారతదేశం కోసం అనంతమైన సామర్థ్యాన్ని, రాబోయే తరాలను ఇక్కడ సృష్టించనున్నట్లు వెల్లడించారు. దీంతోపాటు యువత సాధికారత కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మరింత మద్దతు ఇస్తామని అదానీ హామీ ఇచ్చారు.
రాహుల్ స్పందిస్తారా
అయితే గౌతమ్ అదానీ, రేవంత్‌రెడ్డి కలవడం ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ఇరువురు నేతలు సమావేశమయ్యారు. గౌతమ్ అదానీ గ్రూప్ తెలంగాణలో రూ. 12,400 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఎంఓయూపై కూడా ప్రస్తావించారు. అయితే గతంలో రాహుల్ గాంధీ గౌతమ్ అదానీపై విమర్శలు చేశారు. కానీ ప్రస్తుతం మాత్రం తెలంగాణలో పెట్టుబడులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గౌతమ్ అదానీకి స్వాగతం పలకడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరి ఈ విషయంలో రాహుల్ గాంధీ స్పందిస్తారా లేదా అనేది చూడాలి మరి.
అదానీ ఫౌండేషన్ 19 రాష్ట్రాల్లో
అదానీ ఫౌండేషన్ 19 రాష్ట్రాల్లోని 6,769 గ్రామాల్లో పని చేస్తోంది. ఈ సమయంలో ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ ప్రీతి అదానీ నాయకత్వంలో సంస్థ సుమారు 91 లక్షల మంది జీవితాలకు సానుకూల దిశను అందించింది. ఈ ఫౌండేషన్ దాదాపు 94 CSR సైట్లలో పని చేస్తోంది.
త్వరలోనే కోర్సులు ప్రారంభం
మరోవైపు ఇటివల తెలంగాణలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించగా.. మరికొన్ని రోజుల్లో కోర్సులు కూడా మొదలుకానున్నాయి. మొదటగా నాలుగు కోర్సులను ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వాటిలో లాజిస్టిక్స్ అండ్ ఈ కామర్స్, హెల్త్ కేర్, స్కూల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్, లైఫ్ సైన్సెస్ ఉన్నాయి. ఈ కోర్సులలో చేరాలనుకునే వారు అక్టోబర్ 29లోపు అధికారిక వెబ్‌సైట్ https://yisu.in/ ద్వారా అప్లై చేసుకోవాలి. నవంబర్ 4 నుంచి కోర్సులు మొదలుకానున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
Ani Master: జానీ మంచివారు...నిరపరాధి అని తేలితే ఏంటి పరిస్థితి
Harish Rao: సీఎం రేవంత్ వ్యాఖ్యలపై హరీష్ ఏ రేంజ్‌లో సవాల్ విసిరారంటే
రేవంత్ రెడ్డి మూసీపై అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు
మార్కెట్లోకి అదిరిపోయే ఈవీ బైక్.. ఫీచర్లు తెలిస్తే
For More Telangana News and Telugu News
Updated Date - Oct 18 , 2024 | 08:45 PM