Hyderabad: బుద్ధుని బోధనలతో సమాజ రుగ్మతలు దూరం: జూపల్లి
ABN, Publish Date - Oct 28 , 2024 | 05:28 AM
సమాజంలో నెలకొన్న రుగ్మతల నివారణకు గౌతమ బుద్ధుని బోధనలే శరణ్యమని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
హైదరాబాద్, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): సమాజంలో నెలకొన్న రుగ్మతల నివారణకు గౌతమ బుద్ధుని బోధనలే శరణ్యమని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గౌతముని బోధనలను ఆచరించడం ద్వారా మానవ జీవితానికి పరిపూర్ణత సిద్ధిస్తుందని పేర్కొన్నారు. సికింద్రాబాద్ మహాబోధి బుద్ధ విహార్‌లో ఆదివారం మహాబోధి దయక మండలి, మహాబోధి బుద్ధవిహార్ ఆధ్వర్యంలో జరిగిన కఠినచీవర దానోత్సవంలో మంత్రి జూపల్లి పాల్గొన్నారు.
ప్రాచీన బౌద్థ సంస్కృతీసంప్రదాయాల ప్రకారం వర్షావాసం ముగించిన బౌద్ధ భిక్షువులకు వస్త్రాలను దానం చేశారు. అనంతరం శివనాగిరెడ్డి పాళీ భాష నుంచి తెలుగులోకి అనువదించిన బుద్ధవంశం అనే గ్రంధాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బుద్ధిస్ట్ సాంస్కృతిక, వారసత్వ ఉత్సవాలు, త్రిపిటిక పఠన వేడుకలు, త్రిపిటికలను తెలుగులో అనువదించడానికి ప్రభుత్వం నుంచి నాలుగు కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
Updated Date - Oct 28 , 2024 | 05:28 AM