ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: వైద్యశాఖలో త్వరలోనే సాధారణ బదిలీలు!

ABN, Publish Date - Jun 03 , 2024 | 04:53 AM

ఎన్నికల కోడ్‌ ముగియగానే వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగుల సాధారణ బదిలీలు చేపట్టాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. అందుకు సంబంధించిన ఫైలు చాలా వేగంగా కదులుతోంది. విభాగాధిపతుల నుంచి ఆస్పత్రుల సూపరింటిండెంట్ల వరకు బదిలీలు చేపట్టనున్నట్లు సమాచారం.

  • వేగంగా కదులుతున్న ఫైలు.. వివరాల సేకరణ.. ఐదేళ్లకుపైగా ఒకే చోట ఉన్న వారికి స్థానచలనం

  • కోడ్‌ ముగియగానే ప్రక్రియ ప్రారంభం

  • కసరత్తు చేస్తున్న వైద్య శాఖ మంత్రి

హైదరాబాద్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల కోడ్‌ ముగియగానే వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగుల సాధారణ బదిలీలు చేపట్టాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. అందుకు సంబంధించిన ఫైలు చాలా వేగంగా కదులుతోంది. విభాగాధిపతుల నుంచి ఆస్పత్రుల సూపరింటిండెంట్ల వరకు బదిలీలు చేపట్టనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఐదేళ్లకుపైగా ఒకేచోట ఉన్న వారి వివరాలను తక్షణమే పంపాలని శాఖలోని అన్ని విభాగాధిపతులకు ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా శనివారం ఓ మెమో జారీ చేశారు. ఆ సమాచారాన్ని వీలైనంత త్వరగా పంపాలని కోరారు. డీఎంఈ, డీహెచ్‌, టీవీవీపీ, ఆయుష్‌ పరిధిలో ఈ బదిలీలు జరిగే అవకాశం ఉందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. దీనిపై వైద్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్వయంగా పర్యవేక్షిస్తూ కసరత్తు చేస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. గత ప్రభుత్వ హయాంలో కొన్ని విభాగాల్లో తప్ప... చాలా చోట్ల సాధారణ బదిలీలు చేయలేదు. తాజాగా బదిలీలు చేపడితే దశాబ్దానికిపైగా ఎదురుచూస్తున్న వారికి ఊరట కలగనుంది.


మూడు విభాగాధిపతులు ఇన్‌చార్జిలే..

వైద్య ఆరోగ్యశాఖలో మూడు కీలక విభాగాలు-- వైద్య విద్య సంచాలకులు(డీఎంఈ), వైద్య ఆరోగ్య సంచాలకులు(డీహెచ్‌), తెలంగాణ వైద్య విధాన పరిషత్‌(టీవీవీపీ) ఉన్నాయి. ఈ మూడు విభాగాల అధిపతులు ప్రస్తుతం ఇన్‌చార్జులు కావడం గమనార్హం. రెగ్యులర్‌ డీఎంఈ నియామకంపై కోర్టులో కేసు నడుస్తోంది. జూన్‌ రెండో వారంలోగా రెగ్యులర్‌ డీఎంఈని నియమించకపోతే.. కోర్టు ధిక్కరణే అవుతుంది. దీంతో ప్రభుత్వం పదోన్నతులకు సంబంధించి డీపీసీని నియమించింది. కోడ్‌ ముగియగానే వైద్య ఆరోగ్య సంచాలకులు, టీవీవీపీ కమిషనర్‌ పోస్టుల్లో రెగ్యులర్‌ అధికారులను నియమించే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ విభాగాలకు ఇన్‌చార్జులుగా ఉన్న ముగ్గురు అధికారుల్లో ఇద్దరిని మార్చే అవకాశాలున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి.


ఇప్పటికే ఒక విభాగాధిపతిపై అవినీతి ఆరోపణలు రావడంతో.. వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా షోకాజ్‌ నోటీసు జారీ చేశారని వైద్య వర్గాలు చెబుతున్నాయి. వీరితోపాటు.. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రిన్సిపాల్స్‌, బోధనాస్పత్రుల సూపరింటెండెంట్లను కూడా మార్చాలని సర్కారు నిర్ణయించినట్లు సమాచారం. అలాగే, కొందరు వైద్యులు ఉద్యోగంలో చేరినప్పటి నుంచి.. ఏళ్ల తరబడి హైదరాబాద్‌లోనే పాతుకుపోయారు. పదోన్నతులు వచ్చినా.. తమ పలుకుబడి, పైరవీలతో ఇక్కడే కొనసాగుతున్నారు. దీంతో.. చాలా మంది వైద్యులు గ్రామీణ ప్రాంతాల్లోనే పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దీర్ఘకాలంగా గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తున్న వారికి నగరాల్లో అవకాశం కల్పించే దిశలో కసరత్తు సాగుతోందని సమాచారం.


డీఎంహెచ్‌వోలకూ స్థానచలనం

కొన్ని జిల్లాల్లో వైద్యాధికారులపై అవినీతి ఆరోపణలున్నాయు. కొందరి తీరు మొత్తం డీఎంహెచ్‌వో వ్యవస్థకే మచ్చగా మారే పరిస్థితి ఏర్పడింది. ఏళ్ల తరబడి ఒకే జిల్లాలో పాతుకుపోయి.. తీవ్ర అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న వారికి ఎన్నికల ఫలితాల తర్వాత స్థానచలనం తప్పదని తెలుస్తోంది. వీరిపై ప్రభుత్వానికి, జిల్లా మంత్రులకు ఉద్యోగ సంఘాల ప్రతినిధుల నుంచి ఫిర్యాదులు అందాయి. వైద్యఆరోగ్య శాఖ మంత్రి కూడా ఈ విషయాన్ని సీరియ్‌సగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉదాహరణకు ఖమ్మం డీఎంహెచ్‌వో ఐదారేళ్లుగా అక్కడే పనిచేస్తున్నారు. తీవ్ర ఆరోపణలు వచ్చినా.. చర్యలు లేకపోగా.. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే ఆ డీఎంహెచ్‌వోను కాపాడుతున్నారన్న ఆరోపణలున్నాయి.

Updated Date - Jun 03 , 2024 | 04:53 AM

Advertising
Advertising