GHMC: ఐఏఎస్‌లు వర్సెస్ ఇంజనీర్లు..
ABN, Publish Date - Nov 14 , 2024 | 09:52 AM
జీహెచ్‌ఎంసీ(GHMC)లో ఐఏఎస్‌లు, ఇంజనీర్ల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. అదనపు, జోనల్ కమిషనర్లుగా ఉన్న కొందరు ఐఏఎ్‌సలు, ఎగ్జిక్యూటివ్, సూపరింటెండెంట్ ఇంజనీర్ల మధ్య సఖ్యత కొరవడింది. రెండు కేడర్‌ల అధికారుల మధ్య ఆధిపత్య పోరు పౌర సేవలు, మౌలిక వసతుల కల్పనపై ప్రభావం చూపుతున్నాయి.
- బల్దియాలో ఆధిపత్య పోరు
- ఓ ఎస్‌ఈకి అదనపు కమిషనర్ షోకాజ్ నోటీస్
- అభ్యంతరం తెలిపిన ఇంజనీరింగ్ అధికారులు
హైదరాబాద్ సిటీ: జీహెచ్‌ఎంసీ(GHMC)లో ఐఏఎస్‌లు, ఇంజనీర్ల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. అదనపు, జోనల్ కమిషనర్లుగా ఉన్న కొందరు ఐఏఎ్‌సలు, ఎగ్జిక్యూటివ్, సూపరింటెండెంట్ ఇంజనీర్ల మధ్య సఖ్యత కొరవడింది. రెండు కేడర్‌ల అధికారుల మధ్య ఆధిపత్య పోరు పౌర సేవలు, మౌలిక వసతుల కల్పనపై ప్రభావం చూపుతున్నాయి. తాజాగా ఓ అదనపు కమిషనర్.. సూపరింటెండెంట్ ఇంజనీర్‌కు షోకాజ్ నోటీస్ ఇవ్వడం సంస్థలో చర్చనీయాంశంగా మారింది.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: మియాపూర్‌లో మిస్సింగ్.. పెద్దాపురంలో ప్రత్యక్షం
‘ఇందిరమ్మ ఇళ్ల కమిటీల ఏర్పాటు విషయాన్ని పలుమార్లు గుర్తుచేసినా.. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండడం.. పనుల్లో పురోగతి లేకపోవడంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) కింద నిధులు రావడం లేదు’ అని అదనపు కమిషనర్ షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు. ఎస్‌ఈకి షోకాజ్‌పై తెలంగాణ పబ్లిక్ హెల్త్ అండ్ మునిసిపల్ ఇంజనీర్ల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇంజనీర్ల పనితీరుపై అసంతృప్తి ఉన్నా.. చర్యలు తీసుకోవాలన్నా చీఫ్ ఇంజనీర్‌కు సిఫారసు చేయాలని.. నేరుగా ఎలా మెమో జారీ చేస్తారని కమిషనర్ కార్యాలయంలో లేఖ అందజేసినట్టు తెలిసింది.
ఇంజనీర్లపై చర్యలు, బదిలీ, పోస్టింగ్, సరెండర్, ఎఫ్‌ఏసీ అరెంజ్‌మెంట్ వంటి విషయాలను చీఫ్ ఇంజనీర్(Chief Engineer) ద్వారా కమిషనర్‌కు పంపాలని ఏప్రిల్ 26, 2021లో అప్పటి కమిషనర్ మోమో విడుదల చేశారు. ఈ మోమోను సవరిస్తూ ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదు. ఈ నేపథ్యంలో గత మోమో అమలులో ఉందంటూ అదనపు కమిషనర్ షోకాజ్ ఇవ్వడం సబబు కాదన్నది ఇంజనీర్ల సంఘం వాదన. సంబంధిత విభాగం చీఫ్ ఇంజనీర్ అక్టోబరు 31వ తేదీన ఉద్యోగ విరమణ చేసిన దృష్ట్యా.. తాను షోకాజ్ ఇవ్వాల్సి వచ్చిందని అదనపు కమిషనర్ వారితో అన్నట్టు తెలిసింది. గతంలో ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ఓ సర్కిల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వివరణ సహేతుకంగా లేకుంటే శాఖాపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు. దీనిపై అప్పట్లోనూ ఇంజనీర్లు అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలోనే అప్పటి కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఎవరి వాదన వారిదే..
బల్దియా కేంద్ర, జోనల్ కార్యాలయాల్లో అధికారుల మధ్య వార్ ఇబ్బందికరంగా మారుతోంది. మౌలిక వసతుల కల్పనతో పాటు.. తోటి ఉద్యోగుల పనితీరుపైనా ప్రభావం చూపుతోంది. జోనల్, అదనపు కమిషనర్లు, కొందరు ఇంజనీరింగ్ అధికారుల మధ్య విభేదాలతో కింది అధికారులు, ఉద్యోగులు సతమతమవుతున్నారు. ఎగ్జిక్యూటివ్, సూపరింటెండెంట్ ఇంజనీర్లు తమ కేడర్‌ను పట్టించుకోకుండా పలువురు జోనల్, అదనపు కమిషనర్లు వ్యవహరిస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. పనుల్లో ఆలస్యమైతే అడగొద్దా..? ప్రభుత్వ ఆదేశాల మేరకు పనులు చేయాల్సి ఉంటుంది కదా..? అని అదనపు/జోనల్ కమిషనర్లు పేర్కొంటున్నారు.
ఇందిరమ్మ ఇళ్ల కమిటీల ఏర్పాటు విషయంలో అదనపు కమిషనర్, ఎస్‌ఈ మధ్య ఓ సమావేశంలో బిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్టు తెలిసింది. కొందరు ఐఏఎ్‌సలు జోనల్, సర్కిల్ కార్యాలయాల్లోని అధికారులతో సామరస్యపూర్వకంగా ఉంటున్నప్పటికీ ఇంకొందరు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో ఇంజనీరింగ్ అధికారులు కొందరు.. తాము సీనియర్లం.. మమ్మల్ని ప్రశ్నిస్తారా..? మాపై పెత్తనం చేస్తారా..? అన్నట్టు వ్యవహరిస్తున్నారు. పనిచేయకున్నా.. అడగవద్దన్నట్టుగా కొందరి తీరు ఉంటోంది. షోకాజ్ నోటీ్‌సకు ఎస్‌ఈ వివరణ ఇస్తారా..? వివాదం సద్దుమణిగినట్టేనా అన్నది తేలాల్సి ఉంది.
ఈవార్తను కూడా చదవండి: KTR: కొడంగల్ నుంచే రేవంత్ భరతం పడతాం
ఈవార్తను కూడా చదవండి: దాడిని ప్రోత్సహించిన వారిని వదిలిపెట్టం
ఈవార్తను కూడా చదవండి: తండ్రిని పట్టించుకోని కొడుక్కి తగిన శాస్తి
ఈవార్తను కూడా చదవండి: రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారు
Read Latest Telangana News and National News
Updated Date - Nov 14 , 2024 | 09:52 AM