ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

GHMC: డబుల్‌ కసరత్తు !

ABN, Publish Date - Sep 27 , 2024 | 03:54 AM

మూసీ నిర్వాసితులకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు కేటాయిస్తామన్న ప్రభుత్వ ప్రకటనతో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది.

  • మూసీ నిర్వాసితులకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్ణయంతో జీహెచ్‌ఎంసీ అప్రమత్తం

  • అసంపూర్తి పనులపై ప్రభుత్వానికి సమాచారం

  • నిర్మాణాలకు 3 వేల కోట్లు కావాలని అంచనా

  • మూసీ నిర్వాసితులకు 15 వేల ఇళ్లు అవసరం

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): మూసీ నిర్వాసితులకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు కేటాయిస్తామన్న ప్రభుత్వ ప్రకటనతో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. వేర్వేరు కారణాల వల్ల గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఏడాదిన్నరగా నిలిచిపోయిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల పనుల పునఃప్రారంభంపై కసరత్తు మొదలుపెట్టింది. ఇళ్ల నిర్మాణం ఏ దశలో ఉంది.? పనులు పూర్తి చేయడానికి ఎంత డబ్బు కావాలి ? ఇప్పటికే పూర్తయిన ఇళ్లెన్ని ? కేటాయించినవి ఎన్ని ? తదితర వివరాలతో ప్రభుత్వానికి ఓ నివేదిక పంపింది. దాని ప్రకారం వివిధ దశల్లో నిలిచిన 25వేలకు పైగా డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణానికి రూ.3000 కోట్లు అవసరమని జీహెచ్‌ఎంసీ అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఇళ్లు 4500 ఉన్నాయి. మూసీ నిర్వాసితులకు 15వేల ఇళ్లు అవసరమున్న దృష్ట్యా మరో 10 వేల ఇళ్లు సిద్ధం చెయ్యాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తుది దశకు చేరుకున్న ఇళ్ల నిర్మాణ పనులు తొలుత పూర్తి చేయాలని భావిస్తున్నారు.


  • 4,591 ఇళ్లు సిద్ధం.. 10,500 అవసరం

గత ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ పరిధిలోని 109 ప్రాంతాల్లో రూ.9714 కోట్ల అంచనా వ్యయంతో లక్ష.. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టింది. వీటిలో 95,315 ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం కాగా కోర్టు కేసులు ఇతర కారణాల వల్ల 4,685 ఇళ్ల పనులు ప్రారంభం కాలేదు. మొత్తం 69,673 ఇళ్ల నిర్మాణం పూర్తవగా 64,369 ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించారు. పూర్తయిన వాటిలో 4,591 ఇళ్లు ఖాళీగా ఉన్నాయి. ఇందులో అప్పటికే ఉన్న నిర్మాణాలు కూల్చి ఆ స్థలంలోనే కట్టిన 1952 ఇళ్లు కూడా ఉన్నాయి. మూసీ నిర్వాసితులకు ఇళ్లు కేటాయించాలంటే ప్రస్తుతం సిద్ధంగా ఉన్న 4591 ఇళ్లకు అదనంగా మరో 10,500 కావాలి.


అయితే, పెండింగ్‌లో ఉన్న బిల్లులను చెల్లించడంతోపాటు ప్రస్తుత ధరలకు అనుగుణంగా టెండర్లలో మార్పులు చేస్తేనే పనులు చేపట్టగలమని కాంట్రాక్టర్లు అంటున్నారు. వందల కోట్ల బిల్లులు బకాయి ఉండడంతో ఏడాదిన్నరగా కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కొన్ని నిధులు విడుదల చేయడంతో తుది దశలో ఉన్న ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు. ఆ తర్వాత పనులు పూర్తిగా నిలిచిపోయాయి. అసంపూర్తి పనులు పూర్తి చేయాలని జీహెచ్‌ఎంసీ.. కాంట్రాక్టర్లను కోరగా ఎనిమిదేళ్ల క్రితం ధరల ప్రకారం పనులు చేయలేమని తేల్చిచెప్పారు. తాజా ఎస్‌ఎ్‌సఆర్‌ ప్రకారం బిల్లులు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. అదే జరిగితే నిర్మాణ వ్యయం మరింత పెరగనుంది.


జీహెచ్‌ఎంసీలో డబుల్‌ ఇళ్ల స్వరూపం

ప్రతిపాదిత డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు 1,00,000

అంచనా వ్యయం 9714.59 కోట్లు

నిర్మాణం మొదలైనవి 95,315

వివిధ కారణాలతో పనులు ప్రారంభించనవి 4,685

పూర్తయినవి 69,673

కేటాయించినవి 64,369

తాళాలు ఇచ్చినవి 59,366

సిద్ధంగా ఉన్న ఇళ్లు 4,591

వివిధ దశల్లో ఉన్న ఇళ్లు 25 వేలకుపైగా

Updated Date - Sep 27 , 2024 | 03:54 AM