ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

గోదావరి-కావేరీ డీపీఆర్‌.. గడువుపై వెనక్కి!

ABN, Publish Date - Apr 20 , 2024 | 08:15 AM

గోదావరి-కావేరీ అనుసంధానం ప్రాజెక్టు ముసాయిదా డీపీఆర్‌పై రాష్ట్రాలకు విధించిన గడువుపై విమర్శలు రావడంతో జాతీయ నీటి అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) వెనక్కి తగ్గింది.

- విమర్శలు రావడంతో గడువు కాలమ్‌ను ఎత్తివేసిన ఎన్‌డబ్ల్యూడీఏ

- ఇచ్చంపల్లి నుంచి కాళేశ్వరానికి నీళ్లు

- మేడిగడ్డను పునరుద్ధరించకపోతే ఇచ్చంపల్లి ఎత్తు పెంచుతాం

- నదుల అనుసంధానం టాస్క్‌ఫోర్స్‌ కమిటీ చైర్మన్‌ వెదిరే శ్రీరామ్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): గోదావరి-కావేరీ అనుసంధానం ప్రాజెక్టు ముసాయిదా డీపీఆర్‌పై రాష్ట్రాలకు విధించిన గడువుపై విమర్శలు రావడంతో జాతీయ నీటి అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) వెనక్కి తగ్గింది. నిన్నటిదాకా నెలాఖరులోగా డీపీఆర్‌పై అభ్యంతరాలు/సూచనలు ఉంటే తెలపాలని, లేని పక్షంలో డీపీఆర్‌ను ఆమోదించినట్లు పరిగణనలోకి తీసుకుంటామని అల్టిమేటం ఇచ్చిన ఎన్‌డబ్ల్యూడీఏ, డెడ్‌లైన్‌అంశాన్ని పక్కనపెట్టినట్లు తాజా ఉత్తర ప్రత్యుత్తరాల్లో పేర్కొంది. వాస్తవానికి ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత ప్రభుత్వాలు ఏ విధాన నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేకుండా పోతోంది. ముఖ్యమంత్రుల స్థాయిలో సంతకాలు చేయాలంటే ఎన్నికల సంఘం అనుమతి కూడా తప్పనిసరి. ఎన్‌డబ్ల్యూడీఏ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో తాజాగా జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల్లో గడువు కాలమ్‌ను ఎత్తివేశారు.

ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ కట్టి..

గోదావరి-కావేరీ అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ కట్టి, అక్కడి నుంచే కాళేశ్వరం ప్రాజెక్టు కింద నీటి అవసరాలు తీర్చడానికి గల అవకాశాలను పరిశీలిస్తున్నామని నదుల అనుసంధానం టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ వెదిరే శ్రీరామ్‌ స్పష్టం చేశారు. ఆ మేరకు ప్రతిపాదనలపై శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన నదుల అనుసంధానం టాస్క్‌ఫోర్స్‌ సమావేశంలో చర్చించారు. దాంతో పాటు భేటీలో ఐదు ప్రాజెక్టులపై చర్చించారు. మేడిగడ్డను పునరుద్ధరణ, మరమ్మతులు చేయకపోతే ఇచ్చంపల్లి బ్యారేజీ ఎత్తును పెంచి.. ఆ బ్యారేజీ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు నీటి అవసరాలు తీర్చడానికి గల అవకాశాలను పరిశీలిస్తున్నామన్నారు. సమ్మక్క బ్యారేజీని 80 మీటర్లకు తగ్గించుకుంటే ఎన్‌వోసీ ఇచ్చేందుకు ఆ రాష్ట్రం సిద్ధంగా ఉందని గుర్తు చేశారు. ఏ విధంగా చూసినా గోదావరి-కావేరీ అనుసంధానంతో తెలంగాణకు మేలే జరుగుతుందని చెప్పారు.

Updated Date - Apr 20 , 2024 | 08:15 AM

Advertising
Advertising